Breaking News

Tag Archives: amaravathi

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సోమవారం ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం గరిష్ఠంగా కర్నూలు జిల్లా నగరడోనలో 45.4డిగ్రీలు నమోదైందని తెలిపారు. 279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఎపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. సోమవారం(20-04-26) పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం …

Read More »

రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది… : మంత్రి కొలుసు పార్ధ సారధి

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. ఆదివారం, చీరాల మండలం, అక్కయిపాలెం గ్రామపంచాయతీ, రామాపురం, పాండురంగా బీచ్ నందు జిల్లా కలెక్టర్, చీరాల ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమామహేశ్వరరావు,బాపట్ల పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ శలగల రాజశేఖర్ తో కలసి బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార …

Read More »

అంతర్జాతీయ హంగులతో సూర్యాలంక తీరం

-క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యాలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సూర్యాలంక తీర ప్రాంతంలోని కాటేజీలు, పర్యాటకులు సేదతీరే ప్రదేశాలు, మౌలిక వసతులను స్వయంగా …

Read More »

పరామోటర్ ఎయిర్ సఫారి…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఆంద్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ముద్దనూరు మూల కొండయ్య, తో కలసి చీరాల మండలం, రామాపురం బీచ్ వద్ద విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరామోటర్ ఎయిర్ సఫారి జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి   ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఆర్డీఓ …

Read More »

మోదీ, అమిత్‌షా ప్రజాస్వామ్య విధ్వంసకర చర్యలు

-మహిళా బిల్లు ముసుగులో రాజకీయ ప్రయోజనాలు -చంద్రబాబు, నితీశ్‌కుమార్ ఎక్స్‌ట్రా ప్లేయర్లు -దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం -ప్రధాని హోదా దిగజార్చిన మోదీ -త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదు – సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామిక వ్యవస్థను విధ్వంసం చేసేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, అమిత్‌షాలు లౌకిక, రాజ్యాంగ విరుద్ధమైన …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం  తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి …

Read More »

గన్నవరంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

-రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా మార్చడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు -ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి.. ప్రతి ఎకరాను సాగులోకి తీసుకొద్దాం -ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ లక్ష్యాలు సుసాధ్యమవుతాయి -గన్నవరం నియోజకవర్గం చిన్న అవుటపల్లిలో ఉపాధి హామీ కూలీల సమక్షంలో కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం చిన్న అవుటపల్లిలో ఎమ్మెల్యే …

Read More »

చాక్‌పీస్ (సుద్దముక్క)పై స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, సీఎం చంద్రబాబు పుట్టిన రోజు తేదీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చాక్‌పీస్ (సుద్దముక్క) పై స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నినాదంతో 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు అని తూర్పుగోదావరి జిల్లా, తీపర్రు, పెరవాలికి చెందిన కోడూరి నాగ రాఘవేంద్రబాబు చెక్కి చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో నిడదవోలు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి ప్రయత్నించినా కలవలేకపోయానని, భవిష్యత్‌లో అయినా అభిమాన నాయకుడిని కలిసి తన నైపుణ్యంద్వారా అభిమానాన్ని చాటుకోవాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు.

Read More »

స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

-100 శాతం చెత్త సేకరణ, ప్రాసెసింగ్ జరగాలి -మున్సిపాలిటీల్లో కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం -పార్కులుగా గ్రామీణ, పట్టణ సరిహద్దు డంపింగ్ యార్డులు -‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో విశాఖ జిల్లాకు మొదటి స్థానం… చివరన నిలిచి ఏఎస్ఆర్ జిల్లా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర సాకారం కావడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైతే… కారణాలు అన్వేషించి చర్యలు …

Read More »

నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పర్యటన

-స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రతీ నెలలో 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఈ నెల ‘జలధార-జలహారతి’ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నీటి ఆవశ్యకతను వివరించేందుకే ఈ థీమ్‌ను ప్రభుత్వం ఎంచుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు నిడదవోలులో నిర్వహించే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి …

Read More »