హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఎన్.ఆర్.ఐ టీడీపీ విభాగాన్ని తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ www.nritdp.com ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసంలో లాంచనంగా ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్.ఆర్.ఐ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 1200 …
Read More »Tag Archives: hyderabad
జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని అందచేసిన పవన్ కళ్యాణ్…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 – 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సి జి ప్రసాద్ , డి జి ఎం లకి చెక్ ను గురువారం ఉదయం తన నివాసంలోఅందించారు. ఈ ఇన్స్యూరెన్స్ ఏప్రిల్ ఒకటి 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ ఇన్స్యూరెన్స్ పాలసీ సలహాదారు వెంకట నరసింహారావు యడ్ల, మరియు పార్టీ కోశాధికారి ఎ.వి. రత్నం పాల్గొన్నారు.
Read More »సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న శైలజనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పాల్గొన్నారు. ప్రస్తుతం పాదయాత్ర మెదక్ జిల్లా లోని కాళ్లకల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మత తత్వ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ …
Read More »సమానత్వ స్ఫూర్తిని లోకానికి చాటిన జగద్గురు రామానుజాచార్యులు…
-మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -‘శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం’ వేడుకలకు హజరైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సమానత్వ స్ఫూర్తిని లోకానికి చాటిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల బోధనలు ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వైష్ణవ దీక్షకు వర్ణాంతరం లేదని, భగవంతుని ఆరాధనకు ప్రతి ఒక్కరూ అర్హులేనని రామానుజాచార్యులు స్పష్టం చేసారన్నారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో జరుగుతున్న సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ వేడుకలకు గురువారం గవర్నర్ హాజరయ్యారు. ఫిబ్రవరి 2 న ప్రారంభమైన ఈ …
Read More »మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను సీఎం కెసిఆర్ కు అందజేసిన మంత్రులు…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమౌతున్న సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు మంగళవారం ప్రగతి భవన్ లో మంత్రులు, గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్, …
Read More »తదేకం ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మహావతార్ బాబాజీ స్ఫూర్తితో నౌషిర్ గురూజీ ప్రారంభించిన తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవి అని జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు అండగా చాలా మంది పెద్దలు, యువతతోపాటు నేనెంతో ఇష్టపడే జనసైనికులు మద్దతు తెలపడం సంతోషదాయకం అని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లో తదేకం ఫౌండేషన్ పక్షాన జనరల్ సంజయ్ మిత్రా పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల …
Read More »శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ముచ్చింతల్ లో సమతామూర్తి భగవద్ రామానుజాచార్య విగ్రహం, అక్కడి 108 దివ్య దేశాల ఆలయాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించి పూజలు నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు
Read More »గాంధీజీ వర్ధంతికి టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు ఘటించారు. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో అహింసా వాదాన్నే…జాతి నినాదంగా మలిచిన మహనీయులు గాంధీజీ అని చంద్రబాబు అన్నారు. చిత్తశుద్దితో న్యాయం కోసం చేసే పోరాటానికి ఎంతటి నిరంకుశత్వమైనా తలవంచక తప్పదని మహాత్ముడు నిరూపించారని కొనియాడారు. గాంధీజీ సూక్తి ప్రతి తరానికి నిత్య స్ఫూర్తి గా నిలుస్తుందన్నారు. ఫాదర్ ఆఫ్ …
Read More »ఆర్ ఆర్ బి , ఎన్టీపీసీ పరీక్షపై అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు తక్షణం స్పందించిన రైల్వే శాఖ…
-అభ్యర్థులు/ఆశావహుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రీకృత ఉపాధి నోటీసు నెంబర్ 01/2019 (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ కోసం గ్రాడ్యుయేట్ మరియు అండర్-గ్రాడ్యుయేట్) ప్రకారం పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ప్రక్రియపై కొంతమంది అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు/ సందేహాలపై రైల్వే శాఖ స్పందించింది. పరీక్ష రెండవ దశకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు అనుసరిస్తున్న విధానం పట్ల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు/ అనుమానులు వ్యక్తమయ్యాయి. వీటిపై స్పందించిన రైల్వే రిక్రూట్మెంట్ …
Read More »ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. దేశానికి వారు సేవలను గుర్తుచేసుకున్నారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సైనిక అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న …
Read More »
Prajavartha Online Telugu News