Breaking News

Tag Archives: machilipatnam

ఈ నెల 05వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం-

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 05 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు …

Read More »

భగీరధుని స్ఫూర్తితో అనుకున్నది సాధించవచ్చు… : జిల్లా కలెక్టర్

-కలెక్టరేట్లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భగీరధుని స్ఫూర్తితో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భగీరథ మహర్షి జయంతి వేడుకల కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన 2047 విజన్ ప్రణాళికల తయారీపై వివిధ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలుకు జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల వారీగా ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల రూపురేఖలు మార్చే …

Read More »

నీట్ పరీక్షలు ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 4 వ తేదీ ఆదివారం జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షలు ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 4 వ తేదీ ఆదివారం …

Read More »

బీచ్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై దిశా నిర్దేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం మంత్రి నగరంలోని రహదారులు భవనాల అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, సహాయ కలెక్టరు ఫరీన్ జైద్ తో కలిసి మంగినపూడి బీచ్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు. రేఖా చిత్రపటాన్ని పరిశీలించి ప్రదర్శనశాలలు ఫుడ్ కోర్టులు పార్కింగ్ జల క్రీడలు …

Read More »

ఆడిటర్స్ కు సంఘ ఆడిట్ పై workshop

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ సహకార సంవత్సరము-2025 సందర్భంగా ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘములలోని ఆడిటర్స్ కు సంఘ వ్యవహారాలు సంపూర్తిగా కంప్యూటరైజేషన్ చేసినందున ది.01.04.2025 నుండి మాన్యువల్ రికార్డుతో సంబంధము లేకుండా e-PACS ద్వారా కార్యక్రమములు నిర్వహించు చున్నందున 2024-25 సంవత్సరమునకు సంఘ వ్యవహారాలు e-Audit చేయుటకు సహకార శాఖలోని ఆడిటర్స్ కు మరియు చార్టర్ accountants కు computerization of PACS మరియు e-Audit పైన సహకార సంఘాల రిజిష్ట్రారు మరియు కమీషనర్, గుంటూరు వారు …

Read More »

సామాజిక.. ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– పెన్షన్ అందించి పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిదే – హామీ మేరకు ఏప్రిల్ నుండే రూ.4000 పెన్షన్ ఇస్తున్నాం – గత పాలకులు హామీ ఇచ్చి దగా చేశారు – పెన్షన్ల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇది మంచి ప్రభుత్వం అని పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో పలు ప్రాంతాల్లో పర్యటించి …

Read More »

నెలలో మొదటి రోజునే ఠంచనుగా పింఛన్ల పంపిణీ

-రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి -రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పింఛనుదారులకు ప్రతి నెల మొదటి రోజునే ఠంచనుగా పింఛన్లను అందించి ఆర్థిక భద్రత కల్పిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి నగరంలోని 41వ డివిజన్ రాజీవ్ నగర్, అదేవిధంగా సుల్తానగరం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాదు నుండి హెలికాప్టర్లో బయలుదేరి కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలోనీ దనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకోగా హెలిపాడ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు …

Read More »

“జాబ్ మేళా”

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను బుధవారం ఉయ్యూరు లోని “A.G & S.G Siddhartha Degree College of Arts & Science” నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్ బాబు, APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ Dr. M.శివనాధ్ సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, ఎమ్ఎస్ఎన్ …

Read More »