Breaking News

Tag Archives: nandigama

సంక్షేమాభివృద్ధికి పాటుపడుతున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. మంత్రి జోగి రమేష్

నందిగామ:, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటి సంక్షేమం కోసం నిత్యం శ్రమిస్తూ వారి సంక్షేమాభివృద్ధికి పాటుపడుతున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రజలను కోరారు.పెడన మండలం, నందిగామ సచివాలయం పరిధిలోని  నందిగామ గ్రామంలో ఆయన బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతకంతో కూడిన కరపత్రాన్ని లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా మంత్రి ఇంటింటిని సందర్శిస్తూ …

Read More »

నందిగామలో పలు కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని)

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ కోర్ట్ రోడ్డు నందు నర్వినేని మురళి  నూతన కావేరి టైల్స్ పార్క్& సానిటరీ వేర్ షోరూమ్ ని నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) ప్రారంభించారు. ఆదివారం నందిగామలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గారికి నందిగామలో తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు. వందలాది బైకులతో నందిగామ పురవీధుల్లో అభిమానులు.భారీ ర్యాలీ, …

Read More »

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా సహకరించాలి…

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ [UTF] ఎన్టీఆర్ జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  పాల్గొన్నారు. ముందుగా యూ.టి.ఎఫ్. వ్యవస్థాపకులు దాచూరి రామిరెడ్డి – సుబ్బారావు, ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీలు మరియు మృతి చెందిన సభ్యుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఎప్పుడూ…

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వ వద్ద పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే గడువుకు కొత్త తేదీలను ఇస్తున్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు సమస్యలను పరిష్కారం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కార్యదర్శి ఎం డి ఇక్బాల్ డిమాండ్ చేశారు.. స్థానిక నందిగామ ఎన్జీఓస్ హోమ్ …

Read More »

ముందస్తుగా సాగునీటి విడుదలకు ప్రణాళికను ఖరారు చేసిన క్యాబినెట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాదిలో మూడు పంటలు పండించే విధంగా రైతులకు అవకాశం కల్పించేందుకై ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులకు సాగునీటి విడుదలచేసే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఉన్న నదులు, జలాశయాల నుండి ప్రణాళికా బద్దంగా సాగునీటిని విడుదల చేసేందుకు షెడ్యూలును ఖరారు చేసింది. ప్రతి ఏడాది అనుసరించే వ్యవసాయ సీజన్ కంటే ముందుగానే రైతులు సాగును ప్రారంభించి ఏడాది ఆఖరులో సంభవించే తుఫానుల కంటే ముందుగానే వ్యవసాయ ఉత్పత్తులను రైతులు …

Read More »

మహానేతకు ఘన నివాళులు… : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామలో మహానేత విగ్రహాలకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.  దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, గాంధీ సెంటర్లో, 18 వ వార్డులో, 9 వ వార్డులో ఆయన విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్.మొండితోక.జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ వైయస్ …

Read More »

దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా అభివృద్ధి చేసిన ఘనుడు ఏపీజే అబ్దుల్ కలాం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీజే అబ్దుల్ కలాం కు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  ఘన నివాళులు అర్పించారు. నందిగామ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కలాం చిత్రపటానికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి ఏపీజే అబ్దుల్ కలాం …

Read More »