– ఉద్యాన పంటలు దిశగా రైతులు ముందడుగు వేయాలి – పశు పోషణతోనూ మెరుగైన అదనపు ఆదాయాలు – స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్‌లో అన్నదాతల భాగస్వామ్యం కీలకం – పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రకాల పంటలను ఒక క్రమపద్ధతిలో పండించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని.. తెగుళ్లు, కలుపు మొక్కలు వంటి సమస్యలతో పాటు ఎరువుల అవసరమూ తగ్గుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం నందిగామ …
Read More »Tag Archives: nandigama
పెద్దవరంలో 500 ఎకరాల్లో పరిశ్రమల్లో రాబోతున్నాయి : ఎంపి కేశినేని శివనాథ్
-నందిగామ నియోజకవర్గంలో మినీ మహానాడు -ముఖ్యఅతిథి గా పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్ -పలు తీర్మానాలు ఆమోదం, నూతన కార్యవర్గానికి అభినందనలు -ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఎంపి కేశినేని నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : యువత ఎక్కువగా వున్న నందిగామ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాది కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరులపాడు మండలంలోని పెద్దవరంలో 500 ఎకరాల్లో భారీ పరిశ్రమలు రానున్నాయని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. .నందిగామ …
Read More »అలివేలమ్మ తిరునాళ్ల మహోత్సవం పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త : చందర్లపాడు గ్రామంలో జరుగుతున్న అలివేలమ్మ తిరుణాల మహోత్సవంలో lసోమవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలిసి పాల్గొన్నారు.. అలివేలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరణాల సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన చేయడానికి విచ్చేసిన జబర్దస్త్ టీంకు అమ్మవారి చిత్రపటాలు బహుకరించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు గ్రామం శ్రేయస్సును కాపాడతారని, గ్రామస్తులకు సుఖసంతోషాలను అందిస్తారని తెలిపారు. ఆ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని అందరు …
Read More »ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన పోటీలు ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, వసంత వెంకట కృష్ణ ప్రసాద్
-లింగాలపాడు లో పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : లింగాలపాడు గ్రామము నందు సోమవారం నాడు కూటమి నేతలు,ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి శ్రీ లక్ష్మీపేరంటాలమ్మ అమ్మవారి తిరునాళ్లలో పాల్గొని ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన పందాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ బసవన్నల (ఎద్దుల) పోటీలు గ్రామ నాగరికత పోకుండా …
Read More »పీ4 మహా యజ్ఞంలో తొలి అడుగు
– రాష్ట్రంలోనే మొదటిసారిగా ముప్పాళ్లలో బంగారు కుటుంబాలకు మార్గదర్శుల సాయం – భవిష్యత్తుకు భరోసాతో పేదలకు తీరనున్న వెతలు – ఈ నలుగురు మార్గదర్శుల స్ఫూర్తి నాలుగు లక్షల మందికి ఆదర్శం కావాలి – ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ముప్పాళ్లలో పడిన అడుగులు – ఆర్థిక చేయూతే కాదు.. పేదరికం నుంచి బయటపడేంత వరకు మార్గనిర్దేశం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలనే గొప్ప లక్ష్యంతో …
Read More »ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన ” పంచాయతీ ఛాంపియన్స్”
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు మండలం నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పొందిన 8 మంది మంగళవారంనందిగామ శాసనసభ్యురాలు విప్ తంగిరాల సౌమ్య ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో గ్రామ పంచాయతీలను ఏ విధంగా అబివృద్ధి చేయాలనే అంశం పై ఫిబ్రవరి 10 తేదీ నుండి 16వ తేదీ వరకు శిక్షణ పొందిన అనేక విషయాల గురించి వివరించారు. …
Read More »టీడీపీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు
-నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కృష్ణకుమారిని ఎన్నుకున్నాం -టీడీపీలో అభిప్రాయ భేదాలంటూ కొంతమంది దుష్ప్రచారం -నా అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించా -గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తప్పవు : ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నామని తెలిపారు. ‘‘టీడీపీలో అభిప్రాయ బేధాలు అని కొంత …
Read More »బడ్జెట్ ద్వారా ఎన్డీయే సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువైంది
-ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా కేంద్ర బెడ్జెట్ -పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉంది -బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు -ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలకు టర్మ్‌లోన్ పథకం ద్వారా రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం -ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉందని …
Read More »ప్రధానమంత్రి సూర్యఘర్ :ముప్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు.ప్రధాన మంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన మరియు ప్రధానమంత్రి-కుసుమ్ పధకాలకు సంబంధించి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ప్రధమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి స్వంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు …
Read More »రహదారి భద్రత – మీ జీవితానికి రక్ష – శ్రద్ధ వహించండి
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా శని వారం న ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయము, నందిగామ నందు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ , స్వర, కె.యం.ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య,కంటి శిబిరాన్ని నిర్వహించామని RTO యం.పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా RTO యం.పద్మావతి మాట్లాడుతూ డ్రైవరులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి చూపు, బిపి, షుగర్ పరీక్షలు చేయించుకొని తదనుగుణముగా జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ప్రమాదాలు జరగవు అని తెలిపారు. సహాయ మోటార్ …
Read More »
Prajavartha Online Telugu News