-నందిగామ నియోజకవర్గంలో మినీ మహానాడు
-ముఖ్యఅతిథి గా పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్
-పలు తీర్మానాలు ఆమోదం, నూతన కార్యవర్గానికి అభినందనలు
-ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఎంపి కేశినేని
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
యువత ఎక్కువగా వున్న నందిగామ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాది కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరులపాడు మండలంలోని పెద్దవరంలో 500 ఎకరాల్లో భారీ పరిశ్రమలు రానున్నాయని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. .నందిగామ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి టిడిపి మినీ మహానాడు కార్యక్రమం మంగళవారం ఆర్.ఎస్. గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.
ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఎంపి కేశినేని శివనాథ్ లతోపాటు టిడిపి శ్రేణులు నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్దికి సంబంధించి పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఎంపి కేశినేని శివనాథ్ ఆ తీర్మానాలకు ఆమోదం తెలపటం జరిగింది. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దేశంలో ప్రాంతీయ పార్టీలో కోటి మంది సభ్యత్వం గల పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. 43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ది చెందటానికి కార్యకర్తల కృషే కారణమన్నారు. రాబోయే తరాలకు తెలుగుదేశం పార్టీ ఒక దిక్సుచిలా వుంటుందన్నారు. దేశంలోనే సంక్షేమం అనేది టిడిపితోనే మొదలైందన్నారు. దేశంలో మొదటి సారిగా నదుల అనుసంధానం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
నందిగామ నుంచి అమరావతికి రైల్వే లైన్ వెళ్లనుందన్నారు. తెలంగాణ నుంచి పలు రైళ్లు వయా నందిగామ నుంచి వెళతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నందిగామ కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయటంతోపాటు ఆయుష్ హాస్పటల్ కూడా నిర్మాణం చేయనుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టిందన్నారు. వేద్రాది ఎత్తిపోతల పథకానికి సంబంధించి బడ్జెట్ మంజూరు అయిందని, ఆర్థిక శాఖ దగ్గర వుందని తెలిపారు. మరో రెండు నెలల్లో బడ్జెట్ విడుదలవుతుందన్నారు. డిపి పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిందన్నారు. ప్రజల సంక్షేమం ఓ వైపు..మరోవైపు రాష్ట్ర అభివృద్ధి తో తనదైన ముద్ర వేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఏ పదవి ఇచ్చినా లోకేష్ కి అలంకారమే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు లో ఏ పదవీబాద్యతలు అప్పగించినా ఆ పదవికే వన్నె తెచ్చే నాయకుడు నారా లోకేష్ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఎంపి కేశినేని శివనాథ్ బదులిచ్చారు. తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులందరం మంత్రి నారా లోకేష్ ఉన్నత పదవి చూడాలని ఆశపడుతున్నట్లు తెలిపారు. తాముందరం క్రమశిక్షణ గల నాయకులమని జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ఏ పదవి ఆదేశిస్తే ఆ పదవి తప్పకుండా లోకేష్ తీసుకుంటారన్నారు.తప్పకుండా రాష్ట్రాన్ని ఏలే నాయకుడిగా చూస్తామని ఎంపి కేశినేని శివనాథ్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బోస్, ఎన్.ఎస్.పి ఎడమ కాలవ చైర్మన్ కోట వీరబాబు, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణ కుమారి, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏల్చూరి రాము, మండల పార్టీ అధ్యక్షులు, వీరంకి వీరాస్వామి, కొండ్రగుంట శ్రీనివాసరావు, మేకల సుధాకర్, బిసి నాయకురాలు నూకానమ్మ లతోపాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News