Breaking News

జ‌గ్గ‌య్య‌పేట ఏసీఏ శిక్ష‌ణ శిబిరానికి మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-జ‌గ్గ‌య్య‌పేట బాయ్స్ హైస్కూల్ లో గ్రౌండ్ గ్రాస్ క‌టింగ్ మిష‌న్ ప్రారంభం
-స‌ర‌దా కాసేపు క్రికెట్ ఆడిన ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్

జ‌గ్గ‌య్య పేట, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో క్రీడాకారుల‌ను తీర్చిదిద్దేందుకు, ప్రోత్స‌హించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నో విధాలుగా స‌హ‌క‌రిస్తున్నారు. ఆ స్ఫూర్తి తో యువ‌త క్రీడాల్లో ప్రోత్స‌హించేందుకు కేశినేని పౌండేష‌న్ ద్వారా మండ‌ల‌స్థాయి క్రికెట్ టోర్న‌మెంట్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ బాయ్స్ హైస్కూల్ మైదానంలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ శిక్ష‌ణ శిబిరాన్ని ఎంపి కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ తో క‌లిసి మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు.

ఈ సంర‌ద్బంగా గ్రౌండ్ లో గ్రాస్ క‌టింగ్ చేసేందుకు కొనుగోలు చేసిన లెటెస్ట్ గ్రాస్ క‌టింగ్ మిష‌న్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ తో క‌లిసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల‌తో మాట్లాడి వారికి కావాల్సిన స‌దుపాయాలు అడిగి తెలుసుకున్నారు. వారు అడిగిన మౌలిక వ‌స‌తులు త‌ప్ప‌కుండా క‌ల్పిస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ హామీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ బ్యాట్ చేతబ‌ట్టి కాసేపు స‌ర‌దా గా నెట్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చైర్మ‌న్ రంగాపురం రాఘవేంద్ర‌, మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ఎం.రామ్మోహ‌న్, టిడిపి ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మైనేని రాధా, కౌన్సిల‌ర్లు క‌న్నెబోయిన రామ‌ల‌క్ష్మీ, గొట్టే నాగ‌రాజు, వెదులాపురం సైదేశ్వ‌ర‌రావు, జోజి ల‌తో పాటు ఇత‌ర నాయ‌కులు స్థానిక ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *