Breaking News

Tag Archives: vijayawada

నెట్టెం రఘురాం జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఛైర్మన్ నెట్టెం రఘురాం జన్మదినోత్సవం సందర్భంగా, కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ తిరువూరు బ్రాంచి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తిరువూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ తాళ్లూరి ఉషాజ్యోతి, అసిస్టెంట్ మేనేజర్ చి. అరుణ్, బ్రాంచ్ పరిధిలోని 8 సంఘాల సీఈఓలు, స్టాఫ్ సభ్యులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More »

కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-కార్మికుడు బలపడితే రాష్ట్రం బలపడుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశంలో కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం -కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిలో కార్మికులు, యాజమాన్యాన్ని రెండు కళ్లలా భావిస్తూ సమతుల్యంగా ముందుకు సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పేర్కొన్నారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళా క్షేత్రం లో శ్రమ శక్తి, ఉత్తమ యాజమాన్య పురస్కారాల ప్రధానోత్సవం-2026 కార్యక్రమానికి కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం …

Read More »

వర్షాకాలం లోపు డ్రైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో చేపడుతున్న డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, రామలింగేశ్వర నగర్ తదితర ప్రాంతాలను పర్యటించి జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

ప్రజలందరూ మధ్యాహ్నం 12 నుంచి నాలుగు గంటల వరకు బయటకు రావద్దు

-పెరుగుతున్న ఎండ తీవ్రత కనుగుణంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్న ఎండ తీవ్రత దృశ్య రానున్న వారం రోజుల్లో ప్రజలందరూ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు రావద్దని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విన్నవించారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో నగరపాలక సంస్థ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెరుగుతున్న ఎండ తీవ్రతకు …

Read More »

ప్రజా ఉద్యమాల్లో సోషల్ మీడియా క్రియాశీలకం

-మోదీ విధానాలతోనే ధరల పెంపు -సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ, ప్రజా సంఘాలు చేపడుతున్న ఉద్యమంలో పార్టీ సోషల్ మీడియా క్రియాశీలకంగా నిలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ చంద్రం బిల్డింగ్ నుంచి సోషల్ మీడియా విస్తృత స్థాయి సమావేశం జూమ్ ద్వారా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన రామకృష్ణ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాల …

Read More »

నూతన ధోభీకానా నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన MLA బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల పడవల రేవతి సెంటర్ వద్ద పాత ధోభీకానా వద్ద ₹16 లక్షల రూపాయలతో నూతన ధోభీకానా నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు రజక సంఘం సోదర సోదరీమణులతో కలిసి శంఖుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ, కులవృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడటమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రంలో తెలుగుదేశం …

Read More »

పేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయం

-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్వోసీలను మంగళవారం, భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. 40 వ డివిజన్ బాల భాస్కర్ నగర్ కు చెందిన గడ్డం సారమ్మ హృద్రోగానికి సంబంధించి రూ 4 లక్షల ఎల్ ఓ సీ ను, 47 వ డివిజన్ కు …

Read More »

డాక్టర్ వైయస్సార్ స్పోర్ట్స్ స్కూల్ నందు సీట్లు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాదికారసంస్థల ద్వారా వైయస్సార్ జిల్లా పుట్టంపల్లి నందు నడపబడుతున్న డాక్టర్ వైయస్సార్ స్పోర్ట్స్ స్కూల్ నందు 2026-27 సంవత్సరానికి గాను 4 నుండి 9 వతరగతుల నందు ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ నందు అప్లికేషన్స్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా 4 నుండి 6 వ తరగతుల వరకు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో మరియు …

Read More »

ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో ‘వెడ్డింగ్ ట్రూసో & లగ్జరీ హాంపర్స్’ పై మాస్టర్ క్లాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఛాంబర్స్ సెంట్రల్ జోన్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వెడ్డింగ్ ట్రూసో & లగ్జరీ హాంపర్స్’ (వివాహ సామగ్రి ప్యాకింగ్ మరియు ప్రీమియం బహుమతుల అలంకరణ) పై ప్రత్యేక మాస్టర్ క్లాస్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్తలు, గృహిణులు, సృజనాత్మక రంగ నిపుణులు మరియు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలు అత్యుత్సాహంగా పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఆకర్షణీయమైన ట్రూసో ప్యాకింగ్ పద్ధతులు, లగ్జరీ హాంపర్ స్టైలింగ్, సృజనాత్మకతతో కూడిన పర్సనలైజేషన్, ప్రీమియం ప్రెజెంటేషన్ …

Read More »

ప్రజలకు మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపు మేరకు 20-05-2026 న నిర్వహించబడనున్న దేశవ్యాప్త ఒకరోజు బంద్‌లో ఎన్‌టీఆర్ జిల్లా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ మరియు ది కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ పాల్గొననున్న నేపథ్యంలో, ప్రజలకు మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. జిల్లాలోని ముఖ్య కేంద్రాలలో గుర్తించిన …

Read More »