Breaking News

కృష్ణవేణి సంగీత నిరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దుర్గా ఘాట్ లో జరిగే కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ సౌజన్యంతో, కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ ను డిసెంబర్ 6 నుండి 8, 2024 వరకు నిర్వహించునున్న నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, మంగళవారం ఉదయం దుర్గా ఘాట్ లో జరిగే మ్యూజిక్ ఫెస్టివల్ ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కర్నాటిక్ సంగీతంతో, కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ తుమ్మలపల్లి కళాక్షేత్రం, దుర్గాఘాట్, దుర్గమ్మ ఆలయం లో జరిగే ప్రదేశాలలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని, అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, ఆలయ, టూరిజం అధికారుల సమన్వయంతో మ్యూజిక్ ఫెస్టివల్ను అంగరంగ వైభవంగా జరిపించేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ 1 రమ్య కీర్తన, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *