Breaking News

టాయిలెట్స్ పనులు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీరాజ్, ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, అంగనవాడి టాయిలెట్స్ పనులు వేగవంతం చేయాలని, పనుల నాణ్యత పట్ల రాజీ పడవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మీకోసం హాల్లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు నియోజకవర్గ, మండల వారి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్, ఉపాధి హామీ, సి ఎస్ ఆర్ పథకాల క్రింద చేపట్టే పనులకు నిధుల కొరత లేదన్నారు. గత వారానికి జరిగిన పనుల పురోగతి కలెక్టర్ సమీక్షిస్తూ నూరు శాతం గ్రౌండింగ్ జరగాలన్నారు ముఖ్యంగా పంచాయతీరాజ్ లో గుడివాడ, గన్నవరం సబ్ డివిజన్లలో పనుల పురోగతి ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ల గుంతలు పూడ్చే పనులు వేగవంతం చేయాలని కొత్త పనుల సాంక్షన్ పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు. టెండర్ ప్రక్రియలో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు.

ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా చేపట్టిన అంగన్వాడీలలో టాయిలెట్ల నిర్మాణ పనులు గ్రౌండింగ్ ఆలస్యం కావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనులు చేపట్టుటకు సిమ్మెంటు, ఇసుక సమస్య లేదని, గ్రావెల్ కొంత సమస్య ఉందని అధికారులు తెలుపగా కలెక్టర్ గ్రావెల్ సమస్య పరిష్కరిస్తామన్నారు.

సి ఎస్ ఆర్ నిధులతో కృత్తివెన్నులో రెండు కమ్యూనిటీ హాల్ నిర్మాణం మొదలు పెట్టాలన్నారు. సంక్షేమ హాస్టల్ ల మరమ్మత్ పనులు వేగవంతం చేయాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. కొత్తగా మంజూరైన పనులు మొదలు పెట్టుటకు వర్క్ ఆర్డర్స్ పెండింగ్ ఉండరాదని సూచించారు. వచ్చే వారానికి పనుల పురోగతి సాధించాలన్నారు.

ఈ ఈ లు, డి ఈ లు, ఏఈలు సమన్వయంతో పనిచేయాలని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. చేసిన పనులు కరెక్ట్ గా రికార్డు చేసి సకాలంలో బిల్స్ అప్లోడ్ చేసి, కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేపట్టిన పనులకు అప్పటివరకు పూర్తయిన పార్ట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లింపుల కోసం అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చేసిన పనులన్నింటికీ బిల్స్ అప్లోడ్ కావాలని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు వేగంగా జరగాలి అన్నారు. సంక్రాంతిలోగా పనులన్ని పూర్తి చేయాలన్నారు.

పంచాయతీరాజ్ ఎస్.ఇ. రమణారావు, డ్వామా పిడి శివప్రసాద్, ఆర్ అండ్ బి ఈ లోకేష్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నటరాజ్, ఏపీఎస్ డబ్ల్యు ఐడిసి. ఈఈ రాయన్న, సిపిఓ గణేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *