Breaking News

నారావారి పల్లె నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణం

సిఎం సోదరుడు మరియు మాజీ ఎంఎల్ఏ రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల ప్రక్రియలు పూర్తి చేసుకుని తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు పయణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నారావారి పల్లె నందు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల ప్రక్రియలు పూర్తి చేసుకుని నేటి శుక్రవారం ఉదయం 11.05 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సాదర వీడ్కోలు లభించింది. డిఐజి షిమోషి బాజ్ పేయ్, జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ , ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి మునిసిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్, ఎంఎల్ఏలు చంద్రగిరి పులివర్తి నాని, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆది మూలం, నగరి భాను ప్రకాష్, సూళ్లూరుపేట నెల వల విజయశ్రీ, పూతలపట్టు మురళి, ఎంఎల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ, శ్రీధర వర్మ, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *