Breaking News

డిసెంబర్02 సోమవారం (నేడు) సూళ్లూరుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు హాజరుకానున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం (నేడు) ఉదయం 10 గం. నుండి సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు నిర్వహించనున్న సూళ్లూరుపేట నియోజక వర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) గ్రీవెన్స్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పాల్గొననున్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సూళ్లూరుపేట నియోజక వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు తప్పక హాజరు కావాలని, జిల్లా కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *