Breaking News

యధావిధిగా డిసెంబర్ 2   సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ డిసెంబర్ 2 వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో  తెలియ చేశారు. డిసెంబర్ 2 వ తేదీ సోమవారం పి జి ఆర్ ఎస్ – మీ కోసం  ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో  “మీ కోసం” కార్యక్రమం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని,  మీ మీ అర్జీలని క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండే డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయి అధికారులకి అందచేయాలని కోరారు. ఆర్జి దారులు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కలెక్టరేట్ వద్ద కు రావద్దని కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు. రెవిన్యూ డివిజనల్ అధికారులకి, మునిసిపల్ కమిషనర్లకు, తహసిల్దార్, ఎంపిడివో ఇతర మండల స్థాయి అధికారులకి అందచేయాలని తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *