Breaking News

సాంకేతిక అభివృద్ధికి నేటి నూతన ఆవిష్కరణలే దోహదం..

-యువతలో ఆలోచన శక్తిని పెంచేందుకు పాలిటెక్‌ ఫెస్ట్‌..
-యం ఎల్‌ సి పి. అశోక్‌ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి యువతలో ఆలోచన శక్తి ద్వారా రూపొందించిన ఆవిష్కరణలో భవిష్యత్‌లో సాంకేతిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని యం ఎల్‌ సి పి. అశోక్‌ బాబు అన్నారు.
విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తున్న రీజనల్‌ పాలిటెక్‌ ఫెస్ట్‌-2024ను మంగళవారం శాసన మండలి సభ్యులు పి. అశోక్‌ బాబు సందర్శించి ఆవిష్కరణలను రూపొందించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అశోక్‌ బాబు మట్లాడుతూ కళాశాల స్థాయిలోనే విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరి కొత్త ఆలోచనలకు కార్యరూపమిచ్చి ప్రాజెక్టులను రూపొందించడం అభినందనీయమన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన 15 పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన సుమారు 125 ఆవిష్కరణలను ప్రదర్శించడం గర్వకారణం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధ్యానత ఇస్తున్నారన్నారు. స్కిల్‌ డవలంప్‌మెంట్‌, సీడ్‌యాప్‌, యంఎస్‌యంఇ కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి అవకాశలు కాల్పించాలని ఆలోచన చేస్తున్నాయన్నారు. స్కిల్‌ డవలంప్‌మెంట్‌ ద్వారా యువతలో సాంకేతిక పరిజ్ఞానం పై శిక్షణ అధించి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిరోద్యగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం కాగా అందులో 50 శాతం సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని యువత సాంకేతిక పరిజ్ఞానం పై మరింత ఆశక్తి పెంచుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. రియల్‌టైమ్‌ టెక్నాలజీస్‌కు సంబంధించి ప్రాక్టికల్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి ఫెస్ట్‌లు ఎంతో దోహదపడతాయన్నారు.
కార్యక్రమంలో పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.విజయసారథి, వివిధ విభాగాధిపతులు సీనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ యం. మధసుదన్‌రావు వివిధ విభాగాధిపతులు కె.విజయ భాస్కర్‌, బి. భీమా నాయక్‌, యం నాగరాజు, ఎ. శివప్రసాద్‌, టి. కొండరెడ్డి ,బి. శైలజా, బి. శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణా,ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన వివిధ పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌, బోదన బోదనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *