పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి పై సమీక్ష

-అధికారులు ఇప్పటికే నిర్దేశించుకున్న పనులు కాలవ్యవధి కంటే ముందే పనులు పూర్తి కావాలి
-భూసేకరణ కి చెందిన పనులు జూన్ 2026 నాటికి పూర్తి చెయ్యాలి
-భూసేకరణ కోసం సమర్ధవంతమైన అధికారిని నియమించడం జరుగుతుంది
– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్ట్ ఒక ఐకానిక్ ప్రోజెక్ట్ గా ప్రత్యేక గుర్తింపు తీసుకుని రావాల్సి అవశ్యకత ఉందనీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోని సమావేశ మందిరంలో మంత్రులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ఇరిగేషన్ , మైల్, అనుబంధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, దిశా నిర్దేశనం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ , పోలవరం ప్రాజెక్ట్ పనులని యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలన్నారు. అందుకు నిర్దేశించిన పనుల విషయంలోను, టైమ్ లైన్స్ లక్ష్యాలను ముందుగా చెయ్యాల్సి ఉందన్నారు.  వాస్తవత దృక్పథం తో పనులు పూర్తి చెయ్యడం, అందుకు అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించే క్రమంలో అధికారులు మరింత సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు, మెగా కంపనీ ప్రతినిధులు సాంకేతిక పరమైన అంశాలను గుర్తించి ఖచ్చితత్వం తో కూడి నిర్దుష్ట కాలములో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు.  వొచ్చే సమావేశంలో పనుల పురోగతి, ప్రణాళిక అంశాల ప్రగతి పై సమీక్షా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మైలు రాళ్ళు చేరుకునేలా సాంకేతిక పరమైన అంశాలను గుర్తించి అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. ఈ సీ ఆర్ ఎఫ్, డయ ఫ్రమ్ వాల్వ్ పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు. ఈ సి ఆర్ ఎఫ్ గ్యాప్ 1 ను డిసెంబర్ 24 నుంచి ఫిబ్రవరి 26 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలుపుగా డిసెంబర్ 25 నాటికి పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్యాప్ 2 పనులు డిసెంబర్ 27 నాటికి బదులు ముందుగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర అనుబంధ పనులు మూడా సమాంతరంగా నిర్వహిస్తూ, యుద్ద ప్రాతిపదికన వేగవంతం చెయ్యాల్సి ఉంటుందన్నారు. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అనుసంధానం చేసే పనులు పూర్తి చెయ్యడం, అందుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. మెటీరియల్, ట్రెయిల్ రన్, సామాగ్రి తరలింపు అంశాల పై నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆచరణలో పెట్టడానికి అధికారులు, కాంట్రాక్టర్లు కట్టుబడి ఉండాలన్నారు.

భూసేకరణ కి సంబంధించిన మానవ వనరులు మంజూరు చెయ్యడం జరుగుతుందని , పర్యవేక్షణా చెయ్యడం కోసం నిబద్ధత కలిగిన అధికారిని నియమిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 26 జూన్ నాటికి భూసేకరణ సంబంధించి అన్ని పనులు పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు మేరకు అవసరమైన అనుమతులు మంజూరు కు ప్రతిపాదనలు పంపడం జరగాల్సి ఉందన్నారు. యుద్ద ప్రాతిపదికన పనులను వేగవంతం చేయాలని, అందుకు నిర్దేశించిన లక్ష్యాలను ముందుగా చెయ్యాల్సి ఉందన్నారు.  వాస్తవంగా పనులు పూర్తి చెయ్యడం, అందుకు అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించే క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ ను ఒక ఐకానిక్ ప్రోజెక్ట్ గా ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావాలని, అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. పనుల విషయంలో, పునరావాస తదితర అంశాల ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే పోలవరం ప్రాజెక్ట్ పనులు చేపట్టడం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్  పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చెందిన పనులు, పనుల పురోగతి సంబంధించిన వివరాలు పిపిటి ద్వారా ముఖ్యమంత్రి కి వివరించారు.  సాంకేతిక పరమైన అంశాలతో కూడిన నివేదికను సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రికి స్టేజ్ వారీగా వివరించడం జరిగింది.

రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. మనోహర్ , ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ , ఎమ్మేల్యే లు చిర్రి బాలరాజు, మిరియాల శిరీష దేవి, మద్దిపాటి వెంకట రాజు, బత్తుల బలరామ కృష్ణ, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్ , కామినేని శ్రీనివాస్, కొలికపూడి శ్రీనివాస రావు , పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, సలహాదారు & ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎమ్. వెంకటేశ్వరరావు,  జిల్లా కలెక్టర్లు వేట్రిసెల్వి , పి ప్రశాంతి, ఏ ఎస్ దినేష్ కుమార్,  ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్. రామ సుందర్ రెడ్డి, పి ఐ పి చీఫ్ ఇంజనీర్ కె. నరసింహా రెడ్డి, కేడిఎస్ సి ఈ బి. రాంబాబు , స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ కే. విజయనంద్, పీపీఏ మెంబర్ సెక్రటరీ ఎమ్. రఘురాం, మెగా డైరెక్టర్ సి హెచ్ పి సుబ్బయ్య, మెయిల్ సిఓఓ ఏ. సతీష్ బాబూ, మేసర్స్ బేయర్ మ్యాక్స్, జెసి పి. ధాత్రి రెడ్డి, అభిషేక్ గౌడ , పి వో ఐటిడిఏ పీవో అపూర్వ భరత్, సబ్ కలెక్టర్ కే. కల్పశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలి

-పీఆర్సీ కమిషన్ తక్షణమే నియమించాలి -ఎన్జీవో నేత ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *