రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం గౌరవ సుప్రీం కోర్ట్ వారి మధ్యవర్తిత్వం మరియు రాజీ మార్గ పధక సంఘం (M.C.P.C) మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత చే 06.01.2025 నుండి 10.01.2025 వరకు అనగా ఐదు రోజుల పాటు 40 గంటల మధ్యవర్తిత్వ తర్పీదు కార్యక్రమం ప్రారంభమైనది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, త్వరితగతిన ప్రయోజనం సమకూరుతుందని, ఖర్చులు లేనటువంటిదని అదేవిధంగా సామరస్యపూర్వకంగా కేసులను పరిస్కరించుకోవచ్చని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమము నందు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలకు చెందిన 24 మంది న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వ నైపుణ్య శిక్షణ అందించడానికి ఢిల్లీ కు చెందిన సీనియర్ శిక్షకులు శ్రీమతి అనూజ సక్సేనా మరియు మధ్య ప్రదేశ్ కు చెందిన సీనియర్ శిక్షకులు నీన ఖరే ల చే 40 గంటల మధ్యవర్తిత్వం తర్పీదు కార్యక్రమం నిర్వహించబడును.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమము నందు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మెన్ శ్రీమతి ఏ. గాయత్రి దేవి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు , 24 మంది ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలకు చెందిన అధనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ మరియు జూనియర్ న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News