కులాల మ‌తాల‌కు అతీతంగా జరుపుకునే పండ‌గ సంక్రాంతి : కేశినేని జానకి లక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ది ప‌థంలో ప‌య‌నిస్తుంది. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సంక్రాంతి పండుగ‌ను ఎంతో సంతోషంగా జ‌రుపుకుంటున్నారు. కులాల మ‌తాల‌కు అతీతంగా జరుపుకునే పండ‌గ సంక్రాంతి అని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి కేశినేని జానకి లక్ష్మి అన్నారు.

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం పంజా సెంట‌ర్ ద‌గ్గ‌ర గ‌ణ‌ప‌తిరావు రోడ్ లో గ‌ల ఖిద్మత్ ఘర్ కార్యాలయం ఆదివారం జ‌రిగిన సంక్రాంతి సంబ‌రాల్లో ముఖ్యఅతిథిగా కేశినేని జానకి లక్ష్మి హాజ‌రైయ్యారు. టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మహమ్మద్ ఫతాఉల్లాహ్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబ‌రాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేశినేని జానకి లక్ష్మి తెలుగు మ‌హిళ‌ల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలప‌టంతోపాటు మ‌హిళ‌ల‌కు చీరలు పసుపు కుంకుమ బ‌హుక‌రించారు.

ఈ సంద‌ర్భంగా కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ మ‌హిళ‌లు స్వ‌యం ఉపాధి రంగం వైపు అడుగులు వేయాల‌ని పిలుపునిచ్చారు. మ‌హిళ‌లు ఆర్థికంగా నిల‌బ‌డితే ఆ కుటుంబంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ది చెందుతుంద‌న్నారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎన్టీఆర్ జిల్లాలో ఇంటికో ఎంట‌ర్ ప్రెన్యూర్ చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ మ‌హిళ‌ల‌కు అండ‌గా వుంటార‌న్నారు.

అనంతరం మహమ్మద్ ఫతావుల్లా మాట్లాడుతూ నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు . ప్ర‌జ‌లు ఏ ఆశ‌ల‌తో అయితే ఎంపిగా కేశినేని శివ‌నాథ్ ను గెలిపించారో వారి ఆశలకు అనుగుణంగా ప‌నిచేస్తున్నార‌ని కొనియాడారు. నగరాభివృద్ధిలో ఎంపి కేశినేని శివనాథ్ త‌న మార్క్ చూపిస్తున్నార‌న్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, తెలుగు మహిళ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షురాలు శుకాశి సరిత , తుపాకుల రవణమ్మ , షేక్ నసీమ, పితాని పద్మ , నంద కుమారి, తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *