Breaking News

29న త్రిపురనేని రామస్వామి శతజయంతి సభ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కవిరాజు త్రిపురనేని రామస్వామి ‘సూత పురాణం’ రాసి శత వసంతాలు అయిన సందర్భంగా కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి ఆధ్వర్యంలో శత వసంతాల వేడుక ఈ నెల 29న బుధవారం ఉదయం 10 గంటలకు జెకెసి కళాశాల ఆడిటోరియంలో జరుగుతుందని సాహితీ సమితి కార్యదర్శి వల్లూరి తాండవకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలో ప్రసిద్ధ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు, ప్రజాసాహితీ ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబులకు పురస్కార ప్రదానం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ సమితి గౌరవాధ్యక్షులు గద్దె మంగయ్య అధ్యక్షత వహిస్తారు. పూర్వాధ్యక్షులు బైరపనేని నరేష్ స్వాగతం పలుకుతారు. సమితి అధ్యక్షులు ఆలోకం పెద్దబ్బయ్య, జొన్నలగడ్డ రామారావు, సమితి పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత ఉపాధ్యక్షులు రావెల సాంబశివరావు, కార్యదర్శి వల్లూరి తాండవకృష్ణ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా చిట్టినేని లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన ‘కవిరాజు విజయం’ సాహితీ పద్యరూపకం ప్రదర్శిస్తారు. సభా కార్యక్రమంలో పివి రమణ బృందం కవిరాజు గీతాలాపన చేస్తారని ఆయన వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సిఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-ఈ నెల 23న తిరుపతి జిల్లా సిఎం పర్యటన సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల తనిఖీ (ఎఎస్ఎల్) లో భాగంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *