Breaking News

ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా (దీపం -2) డెలివరీ చేసినపుడు వినియోగదారుల నుండి బిల్ ధర కన్నా ఎక్కువ వసూలు చేయకూడదు

-వసూలు చేసినచో కఠిన చర్యలు తప్పవు: జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా (దీపం -2) డెలివరీ చేసినపుడు వినియోగదారుల నుండి బిల్ ధర కన్నా ఎక్కువ వసూలు చేయకూడదనీ, వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలను ఆదేశించారు.

శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరము నందు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పౌర సరఫరాల అధికారి శేషాచలం రాజు, గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలతో కలిసి ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం 2) పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు భరోసా కల్పించే దిశగా.. ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం -2) పథకమును ప్రవేశ పెట్టడం జరిగిందని, పారదర్శకంగా జిల్లాలో పథకం అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ లో పని చేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్ లు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు బిల్ ధరకన్నా ఎక్కువగా వసూలు చేయరాదని తెలిపారు. ఇలాంటి వసూలకు పాల్పడినవారిపై ఏజెన్సీల నుండి డెలివరీ బాయ్స్ ను తొలగించవలసినదిగా గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించారు. ఏదైనా పిర్యాదులు వచ్చినచో గ్యాస్ ఏజెన్సీ బి.ఫాం లైసెన్స్ లను రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఓ జయరాజ్, సివిల్ సప్లైడిప్యూటీ తహసీల్దార్ లు, గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *