Breaking News

మంగళవారం (నేడు) తిరుపతి పట్టణం నందు ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ ర్యాలీ

-జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు మంగళవారం ఉదయం 10 గం.లకు ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ ర్యాలీ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మెయిన్ గేట్ నుండి అలిపిరి గరుడ సర్కిల్ వరకు తిరుపతి నగరంలోని అన్ని డీలర్ షో రూముల సిబ్బంది సహాయ సహకారాలతో నిర్వహించబడుతుందని, హెల్మెట్ గురించి అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవ సందర్భంగా నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు మరియు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారని, రహదారి భద్రతపై ఔత్సాహికులు హెల్మెట్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేలా పర్యవేక్షించే వేదిక…

-జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *