Breaking News

భారీ రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి

-మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ సరుకు రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని నిబంధనలు పాటించకుండా భారీ వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామనిమోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ నారాయణరాజు అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా బుధవారంనాడు జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ నందు భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎం వి ఐ నారాయణరాజు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడపరాదని, నిబంధనలకు మించి వాహనంలో అధిక బరువును వేయరాదని ఆయన అన్నారు. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడప రాదని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్ యూనిట్ హెడ్ శివరాజ్ , గౌరవ్ గంగూలీ, లాజిస్టిక్ హెడ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *