Breaking News

ట్రాఫిక్ చట్టాలపై అవగాహన ఉండాలి… : డిటిసి ఎ మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కలిగి ఉండాలని అప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతామని డిటిసి ఏ మోహన్ అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నందు బుధవారం నాడు రవాణా, పోలీస్ శాఖలు బీమా కంపెనీలు, ఎన్జీవోస్ లతో ట్రాఫిక్ చట్టాలపై సెమినార్ డిటిసి ఏ మోహన్, డిసిపి (ట్రాఫిక్) విజయవాడ ఎం. కృష్ణ మూర్తి నాయుడు, ఎడిసిపి.ట్రాఫిక్ విజయవాడ ఎవిఎల్ ప్రసన్న కుమార్ నిర్వహించారు. ఈసందర్భంగా డిటిసి ఏ మోహన్ మాట్లాడుతూ వాహనాల నడిపే డ్రైవర్లు నిర్లక్ష్యం వహించి ప్రమాదాలకు గురిచేస్తే హిట్ అండ్ రన్ కొత్త చట్టంతో డ్రైవర్లకు ఎదురయ్యే సమస్యలను వివరించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వలన ప్రమాదానికి గురై మరణించినట్లయితే ఆప్రమాదాలకు పాల్పడే డ్రైవర్లకు పడే శిక్షలను జరిమానాలను వివరించారు. జీవో నెంబర్ 21 ద్వారా కాంపౌండింగ్ ఫీజులు గురించి మాట్లాడారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల గురించి, గుడ్ సమారిటన్ గురించి ఆయన తెలియజేసారు. ట్రాఫిక్ నిబంధనలు 183, 184,185, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ఉల్లంఘనల గురించి వివరించారు. డిసిపి (ట్రాఫిక్) విజయవాడ ఎం. కృష్ణ మూర్తి నాయుడు, ఎడిసిపి.ట్రాఫిక్ విజయవాడ ఎవిఎల్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే దగ్గర్లో ఉన్న పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. అలా కాకుండా అక్కడి నుండి పారిపోతే డ్రైవర్ కు జైలు శిక్ష, జరిమానా కూడా విధించబడుతుందని తెలిపారు. డ్రైవర్లు సంఘటన స్థలంలోనే ఉండి గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడంలో సహాయపడతారని ఉద్దేశ్యంతో చట్టంలో జరిమానాలను పెంచడం జరిగిందన్నారు. దేశంలో ఏటా వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం లక్ష్యంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా పోలీసు అధికారులు, వాహనాల బీమా కంపెనీ అధికారులు, ఎన్జీవోస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *