Breaking News

విజయవాడలో చిల్లపల్లీస్ వీవర్లి ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత పరిశ్రమలో ఐదు దశాబ్దాల అనుభవం మరియు వారసత్వం ఉన్న సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ వారి చిల్లపల్లీస్ వీవర్లి విజయవాడ లోని బృందావన్ కాలనీ లోని ఏ కన్వెన్షన్ ఎదురుగా శుక్రవారం ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ బ్రాంచ్ తో కస్టమర్ల ఆదరణను మరియు అభిమానాన్ని సంపాదించిన చిల్లపల్లీస్ వీవర్లి ఇప్పుడు విజయవాడకు తన ఉనికిని విస్తరించింది. షోరూంను ప్రఖ్యాత వాణిజ్యవేత్త వల్లూరు అశోక్ బాబు ప్రారంభించగా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మొదటి కొనుగోలు చేసారు. ఈ సందర్భంగా ఎం డి చిల్లపల్లి నిరంజన్‌ మాట్లాడుతూ… 50 ఏళ్ల ఘన వారసత్వం మరియు అనుభవంతో ప్రజల ఆదరాభిమానాలను పొందిన విధ౦గా విజయవాడలోని వినియోగదారులకు కుడా చేరువ అవ్వాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *