Breaking News

ఘనంగా ఉల్లాస్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలోని 4,15,000 మంది నిరాక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని భారత ప్రభుత్వ వయోజన విద్య అండర్ సెక్రటరీ PRADEEP B. HEDAOO అన్నారు. పోరంకిలోని మురళి రిసార్టులో వయోజన విద్యా విభాగం ఆధ్వర్యంలో ఒక రోజు ‘ఉల్లాస్ మేళా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ వయోజన విద్యా సంచాలకులు కృతికా శుక్లా IAS.,  అన్ని జిల్లాల వయోజన విద్య సిబ్బంది, సెర్ప్ సిబ్బంది, వాలంటీర్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఉల్లాస్ మేళాలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అతిథులు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *