Breaking News

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న నాగ చైతన్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సినీ హీరో అక్కినేని నాగచైతన్య విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విజయవాడకు చేరుకున్న “తండేల్” చిత్ర బృందం సభ్యుల తో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండెల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చిన హీరో నాగచైతన్య, నిర్మాత బన్నీ వాసు, డైరెక్టర్ చందు మొండేటి లకు ఆలయ అధికారులు ,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఎన్డీయే కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనాలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *