Breaking News

శాసన మండలి పట్టభద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం…

– మీకోసం పోర్టల్ లో గ్రీవెన్స్ నమోదుకు సమీప సచివాలయాన్ని సంప్రదించొచ్చు.
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా – గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు జనవరి 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసిన తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల మూడవ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ప్రతి సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ సిస్టం కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీశ ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రజలు తమ అర్జీని మీకోసం ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చని.. ఇందుకు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *