Breaking News

ఘనంగా దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనమనపూడిలో ఈనెల 9వ తేదీ (ఆదివారం)న దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపు ఘనంగా జరిగింది. ఆదివారం అనమనపూడిలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దీనంశెట్టి నాగేశ్వరరావు ఆయన కుమారుడు దీనంశెట్టి గోపీలు మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపు జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగురాష్ట్రాల నుండి తమ వంశస్తులు కుటుంబసమేతంగా హాజరయ్యారన్నారు. అవడానికి ఒక్క వంశానికి చెందిన వీర కొలుపు అయినా మహిమాన్వితుడు కావడం వల్ల ఎన్నో మంచి, శుభసూచకాలు జరిగాయి, జరుగుతున్నాయని తెలిపారు. ఇది స్థానిక గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరికీ మంచి జరగాలని చేసే కొలుపు అన్నారు. పూజలు అనంతరం భారీ సంఖ్యలో అన్నదాన వితరణ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దీనంశెట్టి వంశస్థులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *