Breaking News

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎల్వో వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో  లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *