Breaking News

నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల్లో చదువుతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాల పట్ల ఆసక్తిగా కనబరిచేలా ప్రోత్సహించాలని ఒకేషనల్ ట్రైనర్లను ఉద్దేశిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS. అన్నారు.
ఆదివారం విజయవాడలోని మేరి స్టెల్లా కాలేజీలో జరుగుతున్న వృత్తి విద్యా శిక్షకులకు (ఒకేషనల్ ట్రైనర్లకు) ఐదు రోజుల పాటు శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు 10 ట్రేడుల్లో వృత్తి విద్యా కోర్సు అందిస్తున్నామని తెలిపారు.
ఏ విద్యార్థీ పనికిరాడని చదువుకు దూరం చేయకూడదని, విద్యార్థుల్లో కొంతమందికి ఆటలు ఇష్టం, కొంతమందికి సైన్స్ ఇష్టం.. ఇలా ఏ అంశంలో ఆసక్తి ఉంటే అందులో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. వృత్తి విద్యా కోర్సు ద్వారా విద్యార్థుల డ్రాపౌట్ రేటు తగ్గించవచ్చన్నారు. విదేశాల్లో ప్రాథమిక స్థాయి నుండే వృత్తి విద్యను అవలంబిస్తున్నారని పేర్కొన్నారు.
తొలి విడతలో భాగంగా ఐటీ విభాగానికి మేరి స్టెల్లా కాలేజీ(విజయవాడ)లో, అగ్రికల్చర్, ఫుడ్ ప్రోసెసింగ్, హెల్త్ కేర్, గృహోపకరణలు, దుస్తులు తయారీ వంటి విభాగాలకు సెయింట్ జోసెఫ్స్ కళాశాల(గుంటూరు)లో శిక్షణ ఇస్తున్నామన్నారు. శాస్త్రీయ దృక్పథంతో, విద్యార్థులకు ఆలోచన రేకెత్తించేలా, స్వశక్తిమీద జీవనాధారం పెంపొందించుకునేలా విద్యార్థులను తయారు చేయాలని అన్నారు. ఈ నెల 4వ తేదీతో తొలి విడత శిక్షణ ముగియగా, మార్చి 7 నుండి రెండో విడతలో భాగంగా మిగిలిన ట్రేడులు బ్యూటీ అండ్ వెల్ నెస్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా, రిటైల్, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ & హార్డ్ వేర్ అంశాల్లోని ట్రైనర్లకు శిక్షణ ఉంటుందన్నారు. పది ట్రేడుల్లో దాదాపు 2వేలకు పైగా శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *