Breaking News

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎన్జీజివో మహిళా విభాగం క్రీడోత్సవాలను జయప్రదం చేయండి

-ఎన్టీజివో మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ కా॥ వి. నిర్మలా కుమారి, కన్వీనర్ కార్ల్ పి. మాధవి పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం మన ఏ.పి. ఎన్టీజివో సంఘ రాష్ట్ర మహిళా విభాగం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సంవత్సరం కూడా మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 2025 మార్చి 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఎమ్.జి. రోడ్, విజయవాడ నందు మరియు మార్చి 5, 6వ తేదీలలో ఏ.పి. ఎన్డీజివో హెూమ్ నందు ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపబడును. మార్చి 8వ తేది మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ ఎన్జీజివో హెూమ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ మహాసభ జరపాలని నిర్ణయించడమైనది. ఆ రోజు విజేతలకు మహిళా విశిష్ట అతిధులచే బహుమతులు ప్రధానం చేయబడుతుంది. మన ఐక్యమత్యం, మన నాయకుల కృషి, అంకితభావాల ఫలితం, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, రాబోయే రోజుల్లో మనం సాధించుకోబోయే మహిళా అంశాలపై నిరంతరం కృషి చేస్తున్న నాయకులకు వందనాలు, ఉద్యమ పోరాటాల ద్వారా సాధించుకోబోతున్న ఐ.ఆర్., పి.ఆర్.సి., ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, పెండింగ్ ఎరియర్స్ మరియు ఇతర డిమాండ్లు సాధించే దిశగా మన రాష్ట్ర నాయకులు, ఏ.పి. ఎన్టీజివో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కా|| కె.వి. శివారెడ్డి, కా॥ అలపర్తి విద్యాసాగర్ నిరంతరం కృషి చేస్తున్నందుకు వారికి రాష్ట్ర మహిళా విభాగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరూ (గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా) ఈ సదవకాశమును వినియోగించుకొని 4,5,6 తేదీలలో జరగబోపు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనగలరని ఆశిస్తూ మరియు మార్చి 8వ తేదీన జరగబోవు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభను జయప్రదం చేయగలరని కోరుచున్నామన్నారు. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్. రామ్ ప్రసాద్డ్డి, రవాణా మరియు క్రీడాశాఖా మంత్రిగారిచే ఆటల పోటీలు ప్రారంభించబడును. మార్చి 8వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు గాంధీనగర్లోని ఎ.పి. ఎన్జీజివో హెూమ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ మహాసభ కార్యక్రమంలో బలహీనవర్గాల శాఖామాత్యులు  ఎస్. సవిత, కమీషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ శ్రీమతి రేఖా రాణి, ఐ.ఏ.ఎస్., పాల్గొంటారన్నారు. పైన తెలుపబడిన ఆటల పోటీలు మరియు సాంస్కృతి కార్యక్రమాలలో పాల్గొనదలచిన వారందరు ఆయా విభాగాలలో పైన సూచించబడిన నిర్వాహకులకు వారికి తెలుపబడిన మొబైల్ నెంబర్కు మీ పేరు, డిపార్టుమెంటు, హెూదాల వివరాలను వాట్సప్ ద్వారా గాని, ఫోన్ ద్వారా గాని తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.జి.ఇ.ఎఫ్. మహిళా కమిటీ కన్వీనర్ ఎమ్. రాజ్యలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి. జానకి, రాష్ట్ర కార్యదర్శి బి. తులసీ రత్నం, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు లలితాంబ, శాంతిశ్రీ, శివలీల, విజయశ్రీ, మల్లీశ్వరి, సురేఖ, సరస్వతి, నాగలలిత క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి మహిళా నాయకులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *