Breaking News

ముఖ్య జంక్షన్ లలో ఆటో మేటిక్ సిగ్నలింగ్ సిస్టం ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరములో  ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి ఆదేశముల మేరకు ముఖ్య జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడమైనది. ఈ విషయం గుర్చి నగర ప్రజలకు ట్రాఫిక్ విభాగము తరుపున తెలియచేయునది ఏమి అనగా వాహన దారులు సిగ్నల్ జంక్షన్ల వద్ద రెడ్ లైట్ పడినప్పుడు తప్పని సరిగా వైట్ లైన్ వద్ద ఆగి వెళ్ళ వలెను అలా ఆగకుండా వెళ్ళినచో మీ యొక్క వాహనమును ఆటో మేటిక్ సిగ్నలింగ్ సిస్టం ద్వార రికార్డు చేయబడి కమాండ్ కంట్రోల్ వద్ద తప్పిదము గుర్తించి మీకు Online ద్వార చలానా వేయటం జరుగుతుంది. అంతే కాకుండా ఈ సిగ్నల్స్ ద్వార వాహనదారులు మోటార్ వాహన చట్టానికి వ్యతిరేకంగా మరియే ఇతర తప్పిదములు అనగా హెల్మెట్ ధరించక పోయిన, సీటు బెల్ట్ ధరించక పోయిన, ట్రిపుల్ రైడ్ చేసిన, సెల్ ఫోన్ డ్రైవ్ చేసిన, రాంగ్ రోడ్ డ్రైవింగ్ చేసిన, ఓవర్ లోడ్ తో వాహనమును నడిపిన, ఆటో డ్రైవర్లు ఖాకి షర్ట్ ధరించక పోయిన, మరియే ఇతర తప్పిదములు చేసిన వాటిని పైన తెలిపిన ఆటో మేటిక్ సిగ్నలింగ్ సిస్టం ద్వారా రికార్డు చేసి మీరు చేసిన తప్పిదమునకు Online ద్వార చలానా వేయబడుతుంది.

కావున నగరములో వాహనదారులు పై విషయములను గమనించి ఎటువంటి తప్పిదములు చేయకుండా వాహన చట్టాలకు అనుగుణంగా వాహనములు నడుపుచూ ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా మీ గమ్య స్థానములు చేరుకోవాలని ట్రాఫిక్ విభాగము తరుపున తెలియచేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *