Breaking News

పరిశ్రమల నిర్వాహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి

-పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులకు ప్రోత్సాహం అందుబాటులో ఉన్న అవకాశాలు పై సమీక్ష
-నీతి అయోగ్ ద్వారా ఐదు రంగాల్లో గ్రోత్ హబ్ కి తూర్పు గోదావరి జిల్లా ఎంపిక
-జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సభ్యుల గైరాజరు మెమో జారీ కై ఆదేశాలు
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల నిర్వాహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గ్రోత్ హబ్ కింద తూర్పు గోదావరి జిల్లాలో ఏప్రియల్ నెలలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించనున్నట్లు తెలిపారు.

స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఇండస్ట్రస్ సేఫ్టీ కమిటి, 16 వ డీ ఐ ఈ పీ సి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత 15వ కమిటి సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు, చర్య అనంతర నివేదిక పై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పరిశ్రమలకి సంబందించి గణాంకాలు కాకుండ పరిశ్రమలు కోసం వొచ్చిన దరఖాస్తులు ఎందుకు అనుమతుల జారీ లో పెండింగ్ ఉందో, ప్రతి దరఖాస్తు వారీగా నివేదిక కమిటీ ముందు ఉంచాలన్నారు. ఏక గవక్ష ( సింగిల్ విండో) విధానంలో అనుమతులు జారీ చెయ్యాల్సి ఉంటుందన్నారు. అందుకు సంబంధించిన శాఖల అధికారులు అందరూ తప్పనిసరిగా సమావేశానికి హజరు కావాలని స్పష్టం చేశారు. జిల్లాలో అవకాశం ఉన్న రంగాల్లో వ్యాపారం చేయడం సులభం ఆర్గానిక్ జీడి పరిశ్రమ , కాటన్ క్లాత్స్ – చేనేత వస్త్రాలు , గిరిజన ఉత్పత్తులు , అలంకార మొక్కలు, పూల ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం ఉందని, ఆమేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

పరిశ్రమల్లో కొన్ని నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రమాదకర వ్యర్థాలు విడుదల చేసే పరిశ్రమలు నెల రోజులకు, మూడు నెలలకు, ఆరు నెలలకు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి, అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయా పరిశ్రమలలో అలారింగ్, సెన్సార్ పరికరాలు ఖచ్చితంగా పనిచేసేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో ఏడు శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రతి పరిశ్రమ ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తున్నారో లేదో తనిఖీ బాధ్యత కమిటి సభ్యులు దృష్టి పెట్టడం తప్పనిసరి అన్నారు. పరిశ్రమలో పనిచేసే వ్యక్తి, చుట్టు పక్కల ఉన్న వారికి, పర్యావరణానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని పేర్కొన్నారు.  రానున్న రెండు నెలలకు చెందిన పరిశ్రమల తనిఖీ కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సభ్యుల గైరాజరు పై వివరణ కోరాలని, తదుపరి సమావేశంలో గైరాజరీ అయిన వారి పేర్లు మినిట్స్ లో నమోదు చేసి ప్రారంభించాలని కన్వీనర్ కి స్పష్టం చేశారు

గ్రోత్ హబ్ కింద తూర్పు గోదావరి జిల్లా :

కేంద్ర ప్రభుత్వ నీటి ఆయోగ్ బృందం విశాఖ , విజయ నగరం,అనకాపల్లి , తూర్పు గోదావరి జిల్లాలో పరిశ్రమలు , తయారీ రంగం, సేవా రంగం కింద అందుబాటులో ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు జిల్లాల పర్యటనకి రానున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నాలుగు రంగాలలో గ్రోత్ హబ్ కు అవకాశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసే క్రమంలో 1) నర్సరీ అనుబంధ పరిశ్రమ – ఆధారిత విలువ జోడించిన సేవలు , మైక్రో ప్లాంట్స్ , అలంకార మొక్కలు , 2) టైల్స్ పరిశ్రమ, 3) ఆగ్రానిక్ జీడి పప్పు , 4) హెర్బల్ ఉత్పత్తులు , 5) సేవా రంగం (ఐ టి ఆధారిత) ఆయా రంగాల్లో అవకాశాల పై అధ్యయనం చేసేందుకు ఏప్రియల్ నెలలో నీతి అయోగ్ పర్యటక ఉంటుందని తెలియ చేశారు. ఆమేరకు ఆయా రంగాలకు చెందిన వారితో సమావేశాలు ఏర్పాటు చెయ్యాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి వనిధర్ రామన్, పరిశ్రమ ఇన్స్పెక్టర్ డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ తిరుమల రావు , పరిశ్రమల సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ జి. స్వాతి, ఇతర సమన్వయ శాఖల అధికారులు , పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *