Breaking News

పీ 4 కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి

-సర్వే, గ్రామ సభల విజయవంతం చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4) తో స్వర్ణ ఆంధ్ర @ 2047 దిశగా అడుగులు వేయడం లో రెండో విడత లో తూర్పు గోదావరి జిల్లాలో ప్రణాళికలను సిద్ధం చేశామని, ఆమేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ఉదయం పీ 4 పోస్టర్ ను జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి కలక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాజం లో వున్న 20% అత్యంత నిరుపేదల అభ్యునతికి P4 మోడల్ ను అనుసరించడం వల్ల ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం ద్వారా టాప్ 10% తెలుగు ప్రవాసులు మరియు అధిక సంపన్నవ్యక్తుల సహకారంతో పేదరికం లేని సమాజాన్ని సాధించడానికి శ్రీకారం చుట్టడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్య సంప్రదింపు కాలపరిమితి మార్చి 9 వ తేది నుంచి 25 వ తేదీ వరకూ ప్రజలు వారి విలువైన అభిప్రాయాన్ని అందించడానికి ఇక్కడ స్కాన్ చేయండం https://swarnandhra.ap.gov.in/p4 ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.

ప్రణాళికా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

తూర్పు గోదావరి జిల్లా లో 2వ దశ కోసం గ్రామ వార్డు సచివాలయం పరిథిలో 2025 మార్చి 8 నుండి 18 మార్చి వరకు సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.2వ దశ గ్రామసభల షెడ్యూల్ 21 మార్చి నుండి 24 మార్చి, 2025 వరకు  చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే, ప్రజల అభిప్రాయ సేకరణ  , గ్రామ సభల్లో ప్రతిపాదనలని అనుసరించి  మార్చి 27 నాటికి రాష్ట్ర స్థాయి లో డేటా ఖరారు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆమేరకు జిల్లాలో చేపట్టవలసిన క్షేత్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమర్ధవంతంగా పూర్తి చెయ్యాలని కలెక్టర్ కోరారు
ప్రజాభిప్రాయం ద్వారా, వారి ఆలోచన లని అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చి 30 న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

అందువల్ల, 1వ దశ  సర్వే మరియు 2వ దశల గ్రామసభల షెడ్యూల్ ప్రకారం P 4 సర్వే ద్వారా సేకరించిన దిగువన 20% BPL డేటా ఆమోదం కోసం జిల్లా పంచాయతి అధికారి, ఎంపిడివో మరియు పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సభల నిర్వహణకు అవసరమైన సూచనలను జారీ చేసినట్లు తెలిపారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చంద్ర రాముడు వీఆర్వో టి సీతారామమూర్తి సి పి ఓ ఎల్ అప్పలకొండ డిపిఓ శాంతామణి డి ఎల్ డి ఓ స్లివా రెడ్డీ, , వీణాదేవి , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *