Breaking News

‘వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్’ – 2025 విజేతలకు బహుమతులు

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, SCERT, విభా మరియు లీప్ ఫార్వర్డ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ‘వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్’ పోటీ విజేతలకు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  బహుమతులు అందజేశారు. గురువారం విజయవాడలోని బెర్మ్ పార్క్ లో ‘వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్ విజేతలకు’ బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీడీ మాట్లాడుతూ స్పెల్ బి తరహాలో మనదేశంలోని ప్రాంతీయ భాషా పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఏకైక ఆంగ్ల పోటీ అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను సులభతరం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమం ఏఎస్‌ఆర్ జిల్లా పాడేరు డివిజన్‌లోని 11 మండలాల్లో, ఎన్టీఆర్ జిల్లాలోని 17 మండలాల్లో జరిగేది. 2023-24 నుండి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు విస్తరించారు.

వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్ (WPC)
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన “వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్” పోటీని ఏడు జిల్లాల్లో ఐదు స్థాయిల్లో నిర్వహించారు. రాష్ట్ర ఫైనల్స్ 2025 మార్చి 13న విజయవాడలోని హరిత బెర్మ్ పార్క్ హోటల్ లో జరిగాయి. ఈ పోటీలో విజేతలు ఏప్రిల్ 2025లో ముంబైలో జరిగే ఇంటర్ స్టేట్ గ్రాండ్ ఫైనల్స్‌లో పాల్గొంటారు. కార్యక్రమంలో విభా సౌత్ ఇండియా మేనేజర్ T. వీరనారాయణ, లీప్ ఫార్వర్డ్ టీమ్ ప్రణిల్ నాయిక్, శ్వేత, విజయ్ కుమార్, సమగ్ర శిక్షా నుండి జి.అపర్ణ, డాక్టర్ శారద, శైలా కల్పన తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *