-ఎక్కడైతే ఎక్కువ సరఫరా విధానం ఉంటుందో అక్కడే సమస్యలు ఉంటాయి
-ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి
-ఇసుక సరఫరా విధానం లో పారదర్శకత ఉండాలి
-నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యడం జరుగుతుంది
-ఏజెన్సీస్ వారు జవాబుదారీతనం కలిగి ఉండాలి
-డీ ఎల్ ఎస్ ఎ సభ్యులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది
-నిబంధన విషయంలో ఉల్లంఘన చేసినా వారిపై ఎన్ జి టి , సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరిస్తోంది
-ప్రవీణ్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇసుక సరఫరా విధానం ఉండాలని ఈ అంశంపై ప్రతి నెలా రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం జరుగుతోందని మైన్స్ కమిషనర్, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
స్ధానిక కలక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం డిఎల్ఎస్ఎ సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా ప్రత్యెక అధికారి హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ కుమార్ మాట్లాడుతూ, ఉచిత ఇసుక సరఫరా విధానం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దుష్టమైన వ్యవస్థీకరణ విధానం అమలు చేయటం జరుగుతోందని అన్నారు. అదే సమయంలో ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకునే ప్రక్రియను సమాంతరంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇసుక టన్ను రూ.475 లు ఉంటే ఏజెన్సీస్ రూ.229 లు కోడ్ చేసినా, ఇంకా ఇసుక ధర రూ.400 పైగా అమ్మడం ఏమిటి అని ప్రశ్నించారు. సాధ్యం కానీ ధరను ప్రతిపాదించిన ఏజెన్సీస్ ఎందుకు ఎక్కువ రేటు కు అమ్ముతున్నారు అని ప్రశ్నించారు. ఇసుక సరఫరా విధానం లో 60 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా మిగిలిన 40 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చెయ్యాల్సి ఉందనీ ఆమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందనీ తెలిపారు. ఇకపై నిర్వహించే సమావేశానికి ఓపెన్, డిసిల్టేషన్ ఏజెన్సీస్ తప్పని సరిగా హజరు కావాలన్నారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరా పై ఐ వి ఆర్ ఎస్ ద్వారా వొచ్చిన ఫిర్యాదులను సమావేశంలో వినిపించడం జరిగింది. జరిగిన తప్పులు సరిచేసుకోవాలి, ఇకపై రిచ్ లలో ప్రభుత్వ సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యక్షంగా వినియోగదారులతో నేరుగా సంభాషించడం జరుగుతుందని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసు విధానంలో ఇసుక సరఫరా రవాణా వ్యవస్థ ఉండాలనీ స్పష్టం చేశారు.. ఇది తొలి హెచ్చరిక, ఇదే తీరును పునరావృతం చేస్తే తీసుకునే చర్యలకి మిమ్మల్నీ బాధ్యత చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్థుత ఇసుక సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవని, క్యూ ఆర్ కోడ్ ద్వారా సర్వే వివరాలు ప్రతీ ఒక్క వినియోగదారుడికి ఫోన్ చేసి తన అభిప్రాయం తెలియ చెయ్యాల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో 80 శాతం పైగా వినియోగదారుల అభిప్రాయం తెలియ చేసేలా వ్యవస్థీకరణ విధానం ఉండాలన్నారు. ఇరిగేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పర్యావరణ అనుమతుల విషయములో ఖచ్చితమైన మార్గదర్శకాలు పాటించేలా చూడాలని కోరారు. రవాణా వ్యవస్థ పై పర్యవేక్షణా తప్పనిసరి అని పేర్కొన్నారు. కొన్ని ఏజెన్సీస్ సరైన పనితీరు చూపకపోవడం పై షో కాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందనీ, వాటిని పునరావృతం కాకుండా చూడాలని , సకాలంలో సమాధానం ఇవ్వాలన్నారు. నిబంధనలు పాటించని వారి విషయంలో ఎటువంటి ఉపేక్ష ఉండదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇసుక సరఫరా రవాణా వ్యవస్థ పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ప్రత్యెక అధికారి సూచనలను అనుసరించి తదుపరి సమావేశం నాటికి జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ , ఈడి మైన్స్ డి ఫణి భూషణ్ రెడ్డి, ఇతర డిఎల్ఎస్ఎస్ సభ్యులు, ఏజెన్సీ లో ప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News