Breaking News

ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల‌పై అవగాహ‌న స‌ద‌స్సు ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాలి

-ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య , ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ కో-ఆర్డినేటర్ మాదిగాని గురునాథం

జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం ఉపాధి రంగంలో మహిళలతో పాటు,యువతీ యువకులు ముందడుగు వేసి ఎంటర్ ప్రెన్యూర్స్ రాణించేందుకు జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాలపై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అవ‌గాహ‌న స‌ద‌స్సులు ఏర్పాటుచేయిస్తున్నారు. ఆ స‌ద‌స్సులు ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాల‌ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కోరారు.

ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య,ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) కో-ఆర్డినేటర్ మాదిగాని గురునాథంజ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే కార్యాల‌యంలో శ‌నివారం ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల‌పై నిర్వ‌హించబోయే అవ‌గాహ‌న స‌దస్సుల వివ‌రాలు తెలియ‌జేసేందుకు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ ప‌ట్ట‌ణంలోని ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల‌పై ఏర్పాటు చేసే అవ‌గాహ‌న స‌ద‌స్సుల‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తాన‌న్నారు. ప్ర‌జ‌లు ఎంట‌ర్ ప్రెన్యుర్స్ గా మారేందుకు ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సులు ఏర్పాటు చేయిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఒక టీమ్ ను ఏర్పాటు చేయ‌టం చాలా సంతోష‌క‌ర‌మైన విష‌యం అన్నారు.

అనంతరం ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మాదిగాని గురునాథం మాట్లాడుతూ
ప్రతి కుటుంబంలో ఒకరు ఎంటర్ ప్రెన్యూర్ గా తయారై ఆర్థిక స్వాలంబన సాధించాలనే లక్ష్యంతో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పి.ఎమ్.జి.పి (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్-ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం) ద్వారా అందించే ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాలపై అవ‌గాహ‌న స‌ద‌స్సులు ఏర్పాటు చేయిస్తున్న‌ట్లు తెలిపారు.

ఎం ఎస్ ఎం ఈ లోన్లు పై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చేపట్టవలసిన విధి విధానాలను వాటిపై ప్రభుత్వం, బ్యాంకులు కలిగిస్తున్న ప్రోత్సాహకాలను తద్వారా చేకూరే సబ్సిడీలను పూర్తిగా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సులో వివ‌రిస్తామ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మేక వెంకటేశ్వరరావు, జగ్గయ్యపేట రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ కట్టా వెంకట నరసింహారావు, సీనియర్ నాయకులు కొటారు సత్యనారాయణ ప్రసాద్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *