విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాలలో ఇన్ఫర్మేషన్ కార్నర్ ను ఎంపీ కేశినేని శివనాథ్ మరియు కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాంజీ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా గా మహిళలకు మరియు విద్యార్థినులకు అన్ని రకాల సమాచార మరియు మద్దతు ఇచ్చే హెల్ప్‌లైన్ సెంటర్ గా ఈ సమాచార విభాగం ఉపయోగ పడుతుందని ఈవెంట్స్ నివేదికలు హెలోలైన్ సమాచారాలు సామాజిక అంశాల గురించి ఈ విభాగం విద్యార్థినులకు తోడ్పడుతుందని ప్రిన్ ఐపల్ డాక్టర్ సిస్టర్ జాసింత క్వద్రస్ తెలిపారు.
యంపీ శివనాధ్ మాట్లాడుతూ కళాశాల లో ఈ సేవలు ప్రారంభించటం గొప్ప విషయం అని మహిళలకు భద్రత సంబంధిత సమా చారం మరియు వీన్ ఎంపీర్మెంట్ సాధనకు యి వేదిక తోడ్పడటం గొప్ప విషయం అని కళాశాల మంచి పౌరులుగా తీర్చి దిద్దటం లో ప్రముగా పత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రొఫెసర్ రాంజీ వైస్ చాన్సలర్ మాట్లాడుతూ మహిళలు విద్యా లో రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలన్నారు
కరస్పాండెంట్ లేన క్వాడ్రెస్ సూయజ్ మార్పు ట్రస్ట్ చైర్మన్,మాట్లాడుతూ సమాజం లో నీ సమస్యలపై విద్యార్థినులతో ప్రాజెక్టు సర్వే నిర్వహించి నివేదిక ప్రభుత్వానికి అంద చేశామని,సత్వరమే మహిళలకు సాయం అందించటం లో ఈ వేదిక ఉపయోగ పడుతుందని తెలిపారు అనంతరం సేవ విభాగం లో పని చేసిన సామాజిక కార్యకర్తలను సన్మానించారు ముఖ్య అతిథులు ,గౌరవ అతిథులు కళాశాల ప్రిన్సిపాల్,కరస్పాండెంట్ తదితరులు బ్రోచురే విడుదల చేశారు.dr బ్యూలః హై హిస్టరీ,ఉష కుమారి డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ 500 స్టూడెంట్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News