Breaking News

డీకే బాలాజీ 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం గొప్ప విషయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఐఏఎస్ అధికారిగా ఉంటూ డీకే బాలాజీ 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం గొప్ప విషయమని ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ మచిలీపట్నం విభాగం యోగా గురువులు గురునాథ బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డికె బాలాజీ, ఐఎఎస్, రధసప్తమి సందర్భంగా గత ఫిబ్రవరి నెల 2 వ తేదీన కృష్ణాజిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ లో 150 మంది యోగా సభ్యులతో కలిసి 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేసారు. 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేసినందుకు జిల్లా కలెక్టర్ బాలాజీని ఆల్ ఇండియా యోగా ప్రిన్సిపల్ యోగాచార్య డా.దమయంతి శర్మ అభినందించారు. డా. దమయంతి శర్మ  ఇచ్చిన అభినందన సర్టిఫికెట్ ను ఆదివారం ఉదయం నగరంలోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో యోగా సభ్యుల హర్షధ్వానాల మధ్య యోగా గురువులు గురునాధబాబు, మహాలక్ష్మి, చింతయ్య, రమేష్ కలెక్టర్ డికె బాలాజీ కి అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *