Breaking News

ఈ నెల 24 నుండి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు పిజి ఆర్ ఎస్

-ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో జరుగుచున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఇక నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 24 వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లో ఎండ తీవ్రత ఎక్కువగా వున్న కారణంగా ప్రజల సౌకర్యార్థం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కలెక్టరేట్ తో పాటుగా డివిజన్,మండలాల కేంద్రాలలో నిర్వహించే ప్రజా సమస్యల పరిస్కార వేదిక లో ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ప్రజలు ఈ మార్పును గమనించి సద్వినియోగం చేసుకోగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అందరు కలెక్టరేట్ నందు నిర్వహించే పీజీ ఆర్ ఎస్ కార్యక్రమానికి, అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కు సంబంధిత అన్ని శాఖల అధికారులు ఈ నెల మార్చి 24 వ తేది నుండి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *