Breaking News

కోవిడ్ ఫైటర్ సేవలు అభినందనీయం

-పులి శ్రీనివాసులు, ఐఏఎస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదేళ్ల క్రితం గుంటూరు నగరంలో కోవిడ్ పారిన పడి మరణించిన వేలాదిమందికి ఉచితంగా దహన సంస్కారాలు చేయడం, లక్షలాదిమంది పేదలకు భోజన సదుపాయం కల్పించడం, ఆధునిక అంబులెన్స్ తో వందలాది మందికి పలు విధాల ఆరోగ్య సేవలు అందించడం హర్షణీయం, అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కొనియాడారు.
ఈనెల 23వ తేదీ గుంటూరులోని స్థానిక కోబాల్ట్ పేట మూడో లైన్ లో 30 మంది పేద మహిళలకు గత నాలుగు నెలలుగా శిక్షణ అందించి ఉచితంగా నూతన కుట్టుమిషన్లను బహుకరించి వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని నింపి, సాధికారతవైపు పురోగమించేటట్టు కోవిడ్ ఫైటర్స్ కృషి చేయడాన్ని స్వాగతించారు. గుంటూరు నగరంలోని దాతృత్వం గల సంస్థలన్నిటితో ఒక విశాల వేదికను ఏర్పాటు చేసి గుంటూరు నగరపాలక సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృత పరుస్తామన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచ ఆనంద సూచికలో అతి చిన్న దేశమైన ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా అత్యధిక జనాభా గల భారతదేశం 118వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. భారతదేశంలో సేవా సంస్థలు మరిన్ని ముందుకు వచ్చి సమాజంలోని అసమానతలను తగ్గించడానికి, సేవా కార్యక్రమాలను పెంపొందించడానికి కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రోత్సహించాలన్నారు. కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లాబక్షు ప్రసంగిస్తూ దాతలు మరింత మంది ముందుకు వచ్చి కోవిడ్ ఫైటర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తోడ్పాటును అందించాలని కోరారు. కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్ (గోతాల స్వామి) ప్రసంగిస్తూ అభాగ్యులైన నిరుపేదలకు కార్మెల్ సేవా సదన్ నిరంతరం ఆశ్రయమిస్తుందని, పొన్నూరులో 300కు పైగా మహిళా మానసిక వికలాంగులు, గుంటూరులో 70 మంది పురుష మానసిక వికలాంగులను చేరదీసి సేవలందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇబ్రహీం, డాక్టర్ ఆదం ఖాన్, రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సుభాని, నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ అస్ర హుస్సేన్, టోపీ బాబు, సైజుద్దీన్, ఆవాజ్ నేత చిస్టీ, బాజీ భాయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు కుట్టుమిషన్ శిక్షణ పొందిన 30 మంది మహిళలకు నూతన కుట్టు మిషన్లు అందజేస్తూ ప్రతిభ పురస్కార పత్రాలను అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *