Breaking News

గ్రామాల్లో స్మశాన వాటిక‌లు ఏర్పాటు చేయాలి, కోతుల బెడ‌ద తొల‌గించాలి

-ప్రభుత్వాధికారులకు వినతి ప్రతం అందజేసిన పంచాయతీ ఛాంపియన్స్

ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :  విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ‌ ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం తిరువూరు లో ఎ.కొండు మండ‌లం ఎమ్.ఆర్.వో కార్యాల‌యంలో డిప్యూటీ తాహ‌శీల్దార్ రాజ్ కుమార్ కు ఎ.కొండూరు మండ‌లంలో 7 గ్రామాల‌కు అవ‌స‌ర‌మైన‌ స‌న్మాన వాటిక ఏర్పాటు గురించి, మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్ కార్యాల‌యంలో ఎంపీడీవో ఆఫీస్ లో సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు కు మండ‌లంలోని 22 గ్రామాల్లో కోతుల బెడ‌ద తొల‌గించాల‌ని కోరుతూ విన‌తప‌త్రాలు అంద‌జేశారు.

తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఎ.కొండూరు మండ‌లంలోని చీమ‌ల‌పాడు, కృష్ణారావు, చీమ‌ల‌పాడు పెద్ద‌తండా, పొలిశెట్టిపాడు, రెపూడి తండా, మారెప‌ల్లి, రేపూడి కొడూరు గ్రామాల్లో కొన్ని క‌మ్యూనిటీల‌కు స్మశాన వాటిక‌లు లేక ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఎ.కొండు మండ‌లం ఎమ్.ఆర్.వో కార్యాల‌యంలో డిప్యూటీ తాహ‌శీల్దార్ రాజ్ కుమార్ కు వివ‌రించారు.

ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆశయమైన వికసిత్ పంచాయత్ కార్యక్రమంలో భాగంగా పరిపూర్ణ గ్రామ వికాసం కోసం ఈ గ్రామాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాలు ద్వారా ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ తెలిపారు .

అలాగే ఎ.కొండూరు మండ‌లంలో ప్ర‌ధాన స‌మ‌స్య గా వున్న కోతుల బెడ‌ద నుంచి ప్ర‌జ‌ల‌ను , పంట‌ల‌ను ర‌క్షించాల‌ని కోరుతూ ఎంపీడీవో ఆఫీస్ లో సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మండ‌లంలో కోతుల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులను వివ‌రించారు.

ఈ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాధికారులు సానుకూలంగా స్పందించారు. తన పై అధికారులకు సమాచారం తెలియ‌జేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌ల‌పార్టీ అధ్య‌క్షుడు గ‌డ్డి కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసి చైర్మ‌న్ అల‌వాల ర‌మేష్ రెడ్డి, జిల్లా రైతు సంఘం కార్య‌ద‌ర్శి పిన్న‌మ‌నేని శ్రీనివాస్ (అబ్బు), మాజీ ఎఎంసి డైరెక్ట‌ర్ ప్ర‌సాద్ రెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *