విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో లింగ సమానత్వం, రాజ్యంగ విలువలు, విలువలు- విద్య పుస్తకాలు, ఉపాధ్యాయ కరదీపికలు పూర్తయ్యే దశలో ఉన్నాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి అన్నారు. పాఠశాల విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌పై రెండు రోజుల వర్క్‌షాప్ ( ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ స్టేజ్ ) ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు ప్రయోజనాన్ని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని రిసోర్సు పర్సన్లను ఉద్దేశిస్తూ అన్నారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా వర్క్ షాపులో పాల్గొన్న రిసోర్సు పర్సన్లకు క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ వర్క్ షాపునకు ఎస్సీఈఆర్టీ సిబ్బంది, ఉపాధ్యాయులు, DIET ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News