Breaking News

లవ్లీనా పోరాటం స్ఫూర్తిదాయకం… : పవన్ కల్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కు నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని  జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయం నుండి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై తొలి అడుగులు వేస్తున్న దశలోనే లవ్లీనా కాంస్య పతకం దక్కించుకోవడం యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. క్రీడల్లో గెలుపోటములు సహజం. అయితే ఎంత చిత్తశుద్ధితో పోరాడాం అనేది ముఖ్యం. లవ్లీనా పోరాడిన తీరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *