Breaking News

శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
మొదటిసారిగా తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో  జె.శ్యామల రావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా ఇష్థికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష వస్త్రం కప్పిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అటు తరువాత టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ ఛార్జ్ సీవీఎస్వో హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *