Breaking News

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోండి..

-ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు..
-కేంద్ర రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ, ఆర్థిక ప్రయోజనాల లబ్బి పొందండి..
-జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్‌, స్వీగ్గి, జోమోటో వంటి అన్‌లైన్‌ ప్లాట్‌ ఫాం కార్మికులు ఈ`శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ కోరారు.

కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖలు, సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్‌, స్వీగ్గి, జోమోటో వంటి అన్‌లైన్‌ ప్లాట్‌ ఫాం కార్మికులు, గిగ్‌ కార్మికులు ఈ`శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ఈనెల 17వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలపై కార్మిక శాఖ రూపొందించిన అవగాహన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అసంఘటిత రంగాల కార్మికులక సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలను చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రారంభించిందన్నారు. అన్‌లైన్‌ ప్లాట్‌ ఫాం కార్మికులు, గిగ్‌ కార్మికులు ఈ`శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లా వ్యాప్తంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేటి నుండి ఈనెల 17వ తేది వరకు నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలలో సంబంధిత కార్మికులు తప్పని సారిగా పాల్గొన్ని ఈ`శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కల్పిస్తున్న ఆరోగ్య, సంక్షేమ, ఆర్థిక (ఎక్స్‌ గ్రేషియా) ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ`శ్రమ్‌ పోర్టల్‌ నమోదులో కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులు, సలహాలు, సూచనలు, ఇతర వివరాలకు జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు.

అవగాహన పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో డిఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహాం, ఉపకార్మిక కమీషనర్‌ సిహెచ్‌ ఆషారాణి, డిఆర్‌డిఏ పిడి నాంచారయ్య, నగర పాలక సంస్థ యుసిడిపివో వెంకటనారాయణ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *