Breaking News

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీ రాజ్ శాఖలో సమూల సంస్కరణలు

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నో ఏళ్లుగా పంచాయితీ రాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న పదోన్నతలకు నోచుకోని ఉద్యోగులకు ఎట్టికేలకు ఈ రోజు జీఓ ఎంఎస్ నెంబర్ 35 బుధవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈజీఓలో ఇంతవరకు ఎంపిడిఓ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ విస్తరణ అధికారులు క్యాడర్ డిప్యూటీ MPDO గా మార్పు చేస్తూ జీ ఓ విడుదల చేశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పదోన్నతులకు నోచుకోని వేలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఇంతవరకు ఎంపిడిఓ పోస్టులు భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టేవారని.. దీన్ని నూతన జీఓ ప్రకారం రద్దు చేశారని స్పష్టం చేశారు. ఇక నుండి ఎంపిడిఓలు పదోన్నతుల ద్వారా మాత్రమే వస్తారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న నూతన జీఓ 35 ను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జీ ఓ విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి చారిత్రిక నిర్ణయానికి కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ ,గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీ రాజ్ డైరెక్టర్ కృష్ణ తేజ మరియు పవన్ కళ్యాణ్ ఓఎస్డీ వెంకట కృష్ణ లకు పంచాయతీ సంఘ నేతలు మరియు ఉద్యోగలు అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *