-వర్క్ షాప్ నందలి సూచనలు, సలహాలు సీసీఎల్ఎ కి నివేదిస్తాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పీజీఆర్ఎస్ నందు ముఖ్యంగా భూ సంబంధిత రెవెన్యూ, సర్వే అంశాల సమస్యలపై ప్రజల నుండి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ సర్వే శాఖలు అందించే సేవలు ప్రజల సంతృప్తి మేరకు అందిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.
గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జెసి శుభం బన్సల్, డి ఆర్ ఓ నరసింహులు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి పలువురు ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా సర్వే అధికారి అరుణ్, తహశీల్దార్లు, సర్వేయర్లు విఆర్ఓ తదితరులకు రెవెన్యూ, సర్వే అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ వర్క్ షాప్ నందు ల్యాండ్ అలియనేషన్, సెక్షన్ 22 A, భూముల క్రమబద్ధీకరణ, అసైన్మెంట్, ఆర్ఓఆర్ వెబ్ ల్యాండ్ సమస్యలు, ఫ్రీహోల్డ్ , ఇనామ్/ఎస్టేట్ తదితర భూ సంబంధిత, రెవెన్యూ, సర్వే సమస్యలపై CCLA ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, విస్తృతంగా ఎలాంటి భూ వివాద రహితంగా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించుటకు రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించిన నేపథ్యంలో సీసీఎల్ఎ నిర్దేశాల మేరకు ప్రస్తుతం ఉన్న జీ.ఓ లు, మార్గదర్శకాల స్థానే ఏమైనా అవసరమైన మార్పులు చేర్పుల కొరకు వర్క్ షాప్ నిర్వహించి సూచనలు పంపాలని తెలిపిన నేపథ్యంలో, నేడు వర్క్ షాప్ నందు విస్తృతంగా మేథో మథనం ద్వారా పలువురిచే సూచించబడిన సూచనలు సలహాలను తీసుకుని సిసిఎల్ఎ కి కాన్సాలిడేట్ చేసి పంపునన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్ మండ్, సుధారాణి, తిరుపతి, శ్రీకాళహస్తి, ఆర్డీవోలు రామ్ మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, పలువురు తహసీల్దార్లు, సంబంధిత కలెక్టరేట్ సిబ్బంది, ఆర్ఐ, విఆర్ఓ లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News