తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచన లు మేరకు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా డిపిఓ మరియు నారావారిపల్లి స్పెషల్ ఆఫీసర్, .సుశీల దేవి పర్యవేక్షణలో ఈరోజు టైలరింగ్ శిక్షణ కార్యక్రమం రెండు బ్యాచులు, అలాగే అసిస్టెంట్ టెక్స్టైల్ ప్రింటర్ ఒక బ్యాచ్, మొత్తం 60 మందికి సెంట్రల్ గవర్నమెంట్ సంకల్ప్ పథకం ద్వారా డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ అధ్యక్షతన కలెక్టర్, చైర్మన్ మరియు పిడి, డిఆర్డిఏ, కన్వీనర్ గా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జనశిక్షణ సంస్థ వారి ద్వారా ఈరోజు టైలరింగ్ రెండు బ్యాచ్లు, మరియు అసిస్టెంట్ టెక్స్టైల్ ప్రింటర్ ఒక బ్యాచ్ కి శిక్షణ ఇచ్చి ఈరోజు ముగింపు కార్యక్రమం అనగా సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే, పులివర్తి నాని, పులివర్తి సుధా రెడ్డి, వారు విచ్చేసి శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేక చొరవతో స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా జిల్లా కలెక్టర్, ఏపీ ఎస్ ఎస్ డి సి ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి , శిక్షణ పొందిన వారికి మార్కెటింగ్ సదుపాయం, తిరుపతిలో కె.పురుషోత్తం అనే వ్యాపారవేత్త దగ్గర నుంచి మెటీరియల్ ఇక్కడ అందించి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా నాన్ ఓవెన్ బ్యాగ్స్ అలాగే క్లాత్ బ్యాగ్స్ కుట్టిచ్చే విధంగా ప్రత్యాన్మయ ఏర్పాట్లు ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు
అలాగే బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం ఏర్పాటు చేసి మరియు ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకుడు అనే సంకల్పం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరిచి అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ఈరోజు అందివ్వడంతో పాటు అవసరమైన మేరకు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం, ప్రైవేట్ సంస్థల్లో జరుగుతుంది. కావున ఈ శిక్షణకు పొందిన మహిళలందరూ చక్కగా వారు సృజనాత్మ శక్తిని పెంపొందించుకొని ఆర్థికంగా, సాంఘికంగా, నైపుణ్యాన్ని, తెలివితేటలు అభివృద్ధి పరచుకొని వ్యవస్థాపకత అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యానికి సంబంధించినటువంటి మెలకువలు అన్నీ కూడా ఈ శిక్షణలో నెలరోజుల పాటు ఇక్కడ నేర్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆర్. లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, ఏపీ ఎస్ ఎస్ డి సి, వారు మాట్లాడుతూ *సంకల్ప పథకంలో భాగంగా మన నారావారిపల్లెలో 60 మందికి మహిళలకు శిక్షణ ఇచ్చి మార్కెటింగ్ సదుపాయం ,ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అలాగే బ్యాంకు నుంచి రుణ సౌకర్యం తీసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. డిఆర్డిఓ వారి సహాయ సహకారాలతో. అలాగే ఈరోజు శిక్షణ పొందిన వారు అందరిని గౌరవ శ్రీమతి. పులివర్తి సుధా రెడ్డి ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం జరిగినది.
తర్వాత గంగయ్య, ఏపీఎం, డిఆర్డిఏ, మాట్లాడుతూ స్థానికంగా నారవారి పల్లె, కందులవారి పల్లె, భీమవరం, శేషాపురంలో ఉన్నటువంటి ఎస్ ఎస్ జి మెంబర్స్ కి ఈ అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున చక్కగా, క్రమశిక్షణతో, అంకితభవంతో, అందరూ రోజు వచ్చి శిక్షణకు హాజరై నెల రోజులు పాటు బాగా నేర్చుకొని వారు కుటుంబానికి భరోసాగా ఉంటూ, ఆర్థికంగా ఎదగాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీహరి, జనశిక్షణ సంస్థానం, వారు మాట్లాడుతూ సంకల్ప్ పథకంలో భాగంగా ఏపీ ఎస్ ఎస్ డి సి వారు మాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో మా JSS ద్వారా,ఈ శిక్షణ ప్రోగ్రాము క్రమశిక్షణతో నిర్వహించి అన్ని విధాలుగా శిక్షణకు కావలసినటువంటి మెలకువలు నేర్పించి మహిళలకు కావలసినటువంటి పనిముట్లు అందించి మంచి ప్రావీణ్యం, నైపుణ్యం అర్హత, కలిగినటువంటి శిక్షణ ఇచ్చు టీచర్లతో సృజనాత్మక పెంపొందించి, ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేతగా ఎదగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సిబ్బంది, ఏపీ ఎస్ఎస్డిసి సిబ్బంది, సునేషు, దిలీప్,జె ఎస్ ఎస్ సిబ్బంది, హరి, ట్రైనర్స్ మొదలగు వారు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News