-మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పశ్చిమ లోని జిల్లా పార్టీ నాయకులు మరియు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం
-వైసిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమితులైన మాజీ మంత్రి వెలంపల్లి ని దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ జిల్లా నాయకులు మరియు పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పశ్చిమ నియోజకవర్గంలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఇటీవల వైసిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా తిరిగి నియమితులైన వెలంపల్లి శ్రీనివాసరావు ని జిల్లా పార్టీ నాయకులు దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సయ్యద్ అతీక్, పదిలం రాజశేఖర్, మజ్జి శ్రీనివాసరావు, కేసరి సుబ్బారెడ్డి చిన్నోడు, వీర్జాల లీల మధు, బండారి వెంకట్, జిల్లాలోని వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు పడిగపాటి చైతన్య రెడ్డి, షేక్ మస్తాన్, పొలిమెట్ల శరత్, మెట్టు వెంకట రెడ్డి, విశ్వనాథ రవి, యరడ్ల ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News