-జిల్లా అధికారులతో చర్చించిన తడిసిన ధాన్యం కొనుగోలు అంశం
-కలెక్టర్ లక్ష్మీశ తో మాట్లాడిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంగళవారం విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా జిల్లాలో కొన్ని చోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం, మరికొన్ని చోట్ల కల్లాలు, మిల్లులు వద్ద ఉన్న ధాన్యం తడిసిన విషయం తెలుసుకున్న ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తక్షణం తడిసిన ధాన్యం కొనుగోలు అంశంపై కలెక్టర్ లక్ష్మీశ తో పోన్ లో మాట్లాడారు.రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా రైతు సేవ కేంద్రాల ద్వారా తడిసిన ధాన్యంతో పాటు తేమ శాతం ఎక్కువ ధాన్యాన్ని,నూకలకు మినహాయింపు ఇచ్చి కొనుగోలు చేయాలని సూచించారు. ఈ ఖరీప్ సీజన్ లో ప్రభుత్వపు సూచించిన మద్దతు ధర ప్రకారమే సాధారణ రకం ధాన్యం క్వింటాకి రూ.2,300లు, గ్రేడ్ ఎ రకం ధాన్యం క్వింటాకి రూ.2,320లు చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఆరుకాలం శ్రమించి ధాన్యం పండించే రైతులు నష్టపోకూడదన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్య పడకుండా ధైర్యంగా వుండాలన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల నుంచి తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకుంటుమన్నారు.
Prajavartha Online Telugu News